calender_icon.png 16 September, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలీవుడ్ పరిస్థితులు అప్పుడే అర్థమయ్యాయి

16-09-2025 01:06:50 AM

2000 సంవత్సరంలో మిస్ వరల్ కిరీటాన్ని సొంతం చేసుకున్న అనంతరం నటి ప్రియాంక చోప్రా ఇండస్ట్రీకి వచ్చి స్టార్గా ఎదిగారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను సొంత నిర్మాణసంస్థను ప్రారంభించడానికి గల కారణాన్ని వెల్లడించారు. 2015లో తాను పర్పుల్ పెబుల్ పిక్చర్స్ను స్థాపించడానికి బాలీవుడ్ పరిస్థితులే కారణమన్నారు. “2000 సంవత్సరం మిస్ వరల్ కిరీటం గెలుచుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చాయి. హిందీ, తమిళ సినిమాల్లో నటించడం మొదలుపెట్టా.

ఆ తర్వాత రెండేళ్లకు బాలీవుడ్ పరిస్థితులు అర్థమయ్యాయి. సినీనేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చినవారిని ఎంత చులకనగా చూస్తారో తెలుసుకొన్నాను. తరతరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నవారు స్టార్లుగా ఉన్నారు. అలాంటప్పుడు బయట నుంచి వచ్చినవారు పరిశ్రమలో కొనసాగడం అంత సులభం కాదు. కానీ, నేను ఎంతో కష్టపడి ఆఫర్లు అందుకొని సక్సెస్ అయ్యాను. ఏదైనా పట్టుదలతో ప్రయత్నిచడం నా అలవాటు.

నేను ఇబ్బందిపడినట్లు ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో.. సినీ నేపథ్యం లేకుండా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారిని ప్రోత్సహించడానికే నిర్మాణసంస్థను స్థాపించాను” అని ప్రియాంక తెలిపారు. ప్రియాంక నిర్మాణసంస్థలో 2016లో సంతోశ్ మిశ్రా దర్శకత్వంలో వచ్చిన భోజ్పురి మొదటి సినిమాగా విడుదలైంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు విడుదలై విజయాన్ని అందుకున్నాయి. ఇక ప్రియాంక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘ఎస్‌ఎస్‌ఎంబీ’ 29లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఇది రూపొందుతోంది.