23-08-2025 05:19:19 PM
ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్జి వసంత్ పాటిల్(District Judge Vasant Patil) ఇల్లెందు కోర్టును శనివారం సందర్శించారు. జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఇల్లందు బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణంలో మొక్కలు నాటారు. గత ఐదు నెలలుగా నిర్మాణంలో ఉన్న మరమ్మత్తులు పనులను వారు పర్యవేక్షించారు. పెండింగ్లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లను ఆదేశించారు. పలు రికార్డులు పరిశీలన చేశారు.
అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇల్లందు కోర్టుకు కక్షిదారుల కొరకు న్యాయవాదుల కొరకు శౌచాలాయాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసినారు. అనంతరం తేనేటి విందు లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి గారితో పాటు ఇల్లందు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి, ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. ఉమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తిక్, సీనియర్ న్యాయవాదులు పెద్దూరు నరసయ్య, దంతాల ఆనంద్, ఎస్. వి. నరసయ్య, పి. గోపీనాథ్, కే. నారాయణ, పి. బాలకృష్ణ, ఎస్. వెంకటేశ్వర్లు, బి. రవి కుమార్ నాయక్, ఎస్. సత్యనారాయణ దొర, ఎస్. బన్సీలాల్, ఏవో జె. కిరణ్ కుమార్, జిల్లా కోర్టు సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.