calender_icon.png 23 August, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు ప్రజల కోసం నిష్పక్షపాతంగా పని చేయాలి..

23-08-2025 05:16:27 PM

ఎమ్మెల్యే పాయల్ శంకర్..

అదిలాబాద్ (విజయక్రాంతి): ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలు చెల్లించే ట్యాక్స్ లతోనే జీతాలు తీసుకునే అధికారులు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) సూచించారు. ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయని అలాంటప్పుడు ప్రజల కోసం పని చేయాలే తప్ప ఏ రాజకీయ పార్టీకి, నాయకుని కోసం పని చేయవద్దని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ఇందిరమ్మ ఇండ్ల ప్రోసెడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 85, రూరల్ లో 205, మావల మండలంలో 48 మంది లబ్ధిదారులకు ఇండ్ల  నిర్మాణ ప్రోసెడింగ్ కాపీలను అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... రాష్ట్రం నుండి పేదల ఇండ్ల కోసం ఎన్ని ప్రతిపాదనలు వచ్చిన వాటిని మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు వస్తుంటారు పోతుంటారని, కానీ ఉద్యోగం సాధించిన తర్వాత పదవి విరమణ పొందే వరకు ప్రభుత్వ ఉద్యోగి ప్రజల కోసం పనిచేయాలని కోరారు. ప్రభుత్వం అంటేనే ప్రజలని, ప్రజల నుండి వచ్చే టాక్స్ ల రూపంలో వచ్చే నిధులతోనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని అన్నారు. కావున రాజకీయాలతో సంబంధం లేకుండా చిట్ట చివర ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత అధికారులదేనని పేర్కొన్నారు. ఇప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు సైతం నెరవేరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.