01-12-2024 12:00:00 AM
భారతదేశంపై పగబట్టినట్టుగా విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులనుంచి సామాన్య ప్రజలను రక్షించేనాథుల అవసరం ఇవా ళ చాలా కనిపిస్తున్నది. పెను వాతావరణ సంక్షోభంలో కూరుకు పోవడానికి దేశం ఇంకెంతో దూరంలో లేదంటూ అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధు లు అప్రమత్తం కావాలి. అన్ని రకాల స్థిర రక్షణ చర్యలు తీసుకోవాలి. వాతావరణ విపత్తుల పరిరక్షణను అత్యవసర, రోజువారీ వాస్తవికతగా మన ప్రభుత్వాలు గుర్తించగలగాలి.
2024లో ఇప్పటి వరకు నమోదైన జాతీయ స్థాయి గణాంకాలు భవిష్యత్తుపట్ల భ యం గొలిపేవిగా ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదే ఇప్పటిదాకా విపరీతమైన వాతావరణ సంఘటనల కారణంగా ఇప్పటికి 3,200 మం దికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. లక్షల హెక్టార్ల వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. లెక్కలేనన్ని నివాస గృహా లు, పశువులు నాశనమైనట్టు తెలుస్తున్నది. ఈ ఏడాది మొదటి 274 రోజులలోనే విపరీత వాతావరణ విపత్తులు సుమారు 255 నమోదైనట్టు వాతావరణ నిపుణులు వెల్లడించారు.
ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పై నివేదికలు గుర్తు చేస్తున్నాయి. వరదలు, వే డిగాలులు, తుపాన్లు వంటి వైపరీత్యాలవల్ల జరిగే నష్టాలతో ము ఖ్యంగా సామాన్యులు, పేదప్రజలు కోలుకోలేనంతగా నష్ట పోతున్నారు. వారు కోల్పోతున్న ఆస్తిపాస్తుల నష్టాలు ఒక ఎత్తు అయితే, ప్రాణనష్టం ఒక్కటీ మరో పూడ్చలేని లోటుగా చెప్పాలి. ఆర్థిక వెసులుబాటును తిరిగి పొందడానికి వారికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి.
పంటలు నాశనమైనప్పుడు లేదా ఇళ్లు, పశువుల కొట్టాలు తుడిచిపెట్టుకు పోయినప్పుడు ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలే తీసుకుంటాయి. ‘వాతావరణ మార్పు’ ఆయా సమావేశాలలో ఒక చర్చనీయాంశంగానే నిలిచిపోతున్నది తప్ప క్షేత్రస్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు కొరవడుతున్నాయి. గ్రామాలు, పట్టణాల నుంచి నగరాలు, మహానగరాల వరకు అంతటా మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలు, వరదలను తట్టుకునే గృహాలు అవసరం.
తీవ్ర వాతావరణాన్ని పరిస్థితులను తట్టుకోగలిగేలా స్థితిస్థాపక వ్యవసాయ పద్ధతులు, మౌలిక సదుపాయాలకు దేశం తప్పనిసరిగా ప్రాధా న్యం ఇవ్వాలి. అదే సమయంలో, హాని కలిగించే ప్రాంతాలలో మ రింత విధ్వంసం జరగకుండా నిరోధించడానికి అధిక- ప్రమాద పరిణామాలపై ముందు జాగ్రత్తగా కఠినమైన నిబంధనలు విధించాలి.
- గడీల ఛత్రపతి, హైదరాబాద్