calender_icon.png 27 October, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కీడ్రాలో మద్యం కిక్కు ఎవరిదో?

27-10-2025 12:00:00 AM

నేడు వైన్స్ దుకాణాల కేటాయింపు 

యాదాద్రి భువనగిరి అక్టోబర్ 26 ( విజయ క్రాంతి ): 2025.27 రెండు సంవత్సరాల కు గాను ఏ ఫోర్ మద్యం దుకాణాలకు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు లాటరీ పద్ధతి ద్వారా దుకాణాల కేటాయింపు జరగనున్నది. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు చేతుల మీదుగా  తీసే డ్రా కార్యక్రమానికి  ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపు  లాటరీలు తీసే ఫంక్షన్ హాల్ కు చేరుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 82 మద్యం దుకాణాలకు 2776 దరఖాస్తులు వచ్చాయి. గతంలో కన్నా ఈసారి దాదాపు 200 దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుదారులందరూ ఎక్కువ శాతం సిండికేట్ గా ఏర్పడి టెండర్ల లో పాల్గొన్నారు. ఈసారి పాత వారి కన్నా కొత్త వారే ఎక్కువ శాతం పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు.  లక్ ఎవరిని వరించనున్నదోనని దరఖాస్తుదారులు క్షణం క్షణం ఒక రోజుగా గడుపుతున్నారు.

ఒక్కో దరఖాస్తు ఫీజు గతంలో రెండు లక్షలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షలు పెంచడంతో పాత వ్యాపారస్తులు బెంబేలెత్తి చాలామంది టెండర్లకు దూరంగా ఉన్నారు. లాభాలు ఉండవు మూడు లక్షలు పెట్టి టెండర్ వేస్తే  షాపులు వచ్చేది నమ్మకం లేదు వచ్చిన లాభాలు అంతంతే నంటూ ఏళ్ల తరబడి వ్యాపారంలో ఉన్న సీనియర్లు టెండర్లు వేయడానికి ముఖం చాటేసారు. ఎక్కువ శాతం కొత్త వారే టెండర్లలో పాల్గొన్నారు. ఒకవేళ షాపులు కొత్తవారికి దక్కక పోతే చేతులు కాల్చుకున్న వారు అవుతారు.

ఈ నేపథ్యంలోనే క్షణం మొక్క యుగంగా భావిస్తూ తమ ఇష్ట దైవాలకు  మొక్కుతూ లక్కీ డ్రాల కోసం ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసేది మాత్రం 82 షాపులకు మాత్రమే సిండికేట్గా ఏర్పడి ఒక్కొక్క గ్రూపు వారు ఒక్కో షాపుకు ఐదు నుండి పది దరఖాస్తులు చేసినట్లు తెలిసింది. బాగా నడిచి షాపులపై ఎక్కువగా దరఖాస్తులు చేశారు. గతంలో 100 షాపులకు దరఖాస్తులు చేస్తే ఒక్క షాపు వచ్చి లక్షల రూపాయలు నష్టపోయిన వారు ఉన్నారు.

నాలుగు షాపులకు దరఖాస్తు చేసుకున్న వారికి మూడు షాపులు వచ్చిన వారు ఉన్నారు. ఒక్క షాపు కోసం దరఖాస్తు తీసుకున్న వారికి కూడా షాపు వచ్చిన చరిత్ర ఉంది. గతంలో రెండు లక్షలు దరఖాస్తు ఫీజు  కాగా ఈసారి మూడు లక్షలు కావడంతో షాపులు రాకపోతే దరఖాస్తుదారులు పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది.

గతంలో మాదిరిగా రెండు లక్షలు దరఖాస్తు ఫీజు చేస్తే బాగుంటుండే కానీ ప్రభుత్వం తమ ఖజానా నింపుకోవడం కోసం దరఖాస్తు ఫీజును పెంచి  జేబులను కాళీ చేసిందని వాపోతున్నారు. వందల దరఖాస్తులు చేసిన అనుకున్నన్ని షాపులు రానట్లయితే వ్యాపారస్తులు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనున్నది. నష్టపోయిన వాటిని సంపాదించుకోవడానికి ఎక్సైజ్ నిబంధనలకు నీళ్లు వదిలి నకిలీ మద్యం వ్యాపారానికి  సిద్ధమవుతారు.