calender_icon.png 19 May, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ చౌరస్తాలో ఎవరెటు వైపు?

13-03-2025 12:00:00 AM

‘లాభం లేదు జనంలోకి వెళ్లాలి’ అని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ‘ఇక మీదట అసెంబ్లీకి హాజరవుతానని’ ఆయన తాజాగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ప్రస్తుతానికి మంచి ఊపుమీద ఉంది. అందువల్ల కేసీఆర్ మాత్రమే కాదు.. రేవంత్ కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. 

తెలంగాణ రాజకీయ వ్యవస్థలో రోజురోజుకు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రాజకీయాలు ఎంత కైనా దిగజారుతాయన్న విషయం అర్థమవుతుంది. 2024 డిసెంబర్ 7న అధికార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రాగానే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న నిర్బంధ వ్యవస్థను పూర్తిగా తొలగించింది. ప్రభుత్వం ఏర్పడడానికి కారకమైన ఆరు పథకాలను అమలు చేయడంలో ముందుకు వచ్చిన ప్రభుత్వం ఒక్కొక్కటిగా దశలవారీగా అమలు చేస్తోంది.

అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరు పథకాలలో ఒక్క మహిళలకు ఉచిత బస్సుప్రయాణం మాత్రమే పూర్తిగా అమలయింది. ఆ తర్వా త రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా 65 శాతం మంది రైతుల కు మాత్రమే అమలు జరిగింది.

రైతు భరో సా, రైతు బీమాకూడా పూర్తిగా అమలు కాలేదు.మహిళలకు నాలుగు వేల పింఛను ఇప్పటివరకు అమలు కాలేదు. కరెంటు విషయానికొస్తే మాత్రం నాణ్యమైన కరెం టు 24 గంటలు ఇస్తోంది. 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ ఇచ్చే పథకాలు కూడా పూర్తిగా అమలు కావడం లేదు.

దూరమవుతున్న ప్రజలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రజలు ఇప్పుడు అదే చేతులతో దూరం తోసే విధంగా ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆలోచన విధానం మారుతోంది. అమలు చేసిన ఏ పథకమైనా నూటికి నూరు శాతం అమలు జరిగితే ప్రజలు సంతోషిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి బాధ్యతలు భుజాన వేసుకున్న రేవంత్ రెడ్డి తన పరిపాలన వ్యవహారాల శైలిని చక్కదిద్దుకుంటూ ముందుకు పోవడానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా ఆర్థిక సమస్య. గత ప్రభు త్వం చేసిన అప్పులు, ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త పథకాలకు నిధుల లోటు ఏర్పడుతోంది. దీన్ని చక్కదిద్దుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలలో అనేక కుదుపులు జరుగుతున్నాయి. దీనికి తోడు గా కేంద్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్‌లో తెలంగాణకు ఆర్థిక కేటాయింపులు ఒక్క పైసా కూడా లేకపోవడం వల్ల ప్రభుత్వం రెండు వైపులా ఇబ్బందిపడుతోంది.

అనేకసార్లు సీఎం ఢిల్లీ పర్యటనలు చేసి పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అనే క మంది మంత్రులను, అధికారులను కలి సి, ప్రధానికి కూడా వినతి పత్రాలు సమర్పించారు. అయితే ఎంత అప్పుకడుతున్నా రన్నది ప్రజలకు ముఖ్యం కాదు. ఇచ్చిన హామీ మేరకు పథకాలు నూటికి నూరు శాతం అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఇది గమనించుకొని ప్రభు త్వం ముందుకు పోవాలి. 

దూకుడుమీదున్న బీజేపీ

తెలంగాణ శాసనమండలికి ఫిబ్రవరి 27న జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలలో రెండింటిని బీజేపీ గెల్చుకోవ డం ద్వారా తమది పైచేయి అన్నట్లుగా సంబరపడిపోతున్న సమయమిది. అంతేకాకుండా కాంగ్రెస్ బలహీనపడుతోందన్న సంకేతం ప్రజలకు చేరిపోయింది. దీన్ని ఆసరాగా తీసుకొని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి.

ఇదే ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పక్క రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ మొదటినుంచి కొంత బలంగానే ఉంది. ఎన్డీయేను పటిష్టం చేయాలని మోదీ భావిస్తున్నందున వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా ఎన్డీ యే ప్రయోగం అమలు చేస్తారా! అన్న ప్రశ్న కొన్ని రోజులుగా వినిపిస్తోంది.

తెలంగాణలో ఎన్డీయే కూటమి రూపుదిద్దుకోబోతున్నదని పసిగట్టడం వల్లనే కేసీఆర్ ఇటీవల మాట్లాడుతూ, ‘తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయాలను కుంటే సహించేది లేదు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్టీయే కూటమి ఏర్పడితే ప్రధానంగా నష్టపోయేది కేసీఆర్ మాత్రమే. ఈ పరిణామాలను గమనిస్తు న్న కేసీఆర్ ‘ఇక లాభం లేదు జనంలోకి వెళ్లాలి’ అని నిర్ణయించుకున్నారు.

ఇక మీదట అసెంబ్లీకి హాజరవుతానని ఆయన తాజాగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ప్రస్తుతానికి మంచి ఊపు మీద ఉంది. అందువల్ల కేసీఆర్ మాత్రమే కాదు.. రేవంత్ కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికైనా మేల్కొని, రాష్ట్ర నాయకత్వాన్ని పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమా దం లేకపోలేదు.

స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు సమీపిస్తున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభు త్వం తనకు తాను పోస్టుమార్టం చేసుకొని ముందుకు పోవలసిన పరిస్థితులు ఉన్నా యి. ముఖ్యంగా రైతాంగం ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తుంది. రైతులను, గ్రామీణ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంద ని చెప్పాలి.

సుదీర్ఘపోరాటం ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి సమర్థవంతమైన రాజకీయ పరిపాలన వ్యవస్థ అవసరం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అయినప్పటికీ ఉద్యమించింది తెలంగాణ ప్రజ లు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజలకు చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కుగా భావించాలి.

అప్పుడే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయపరంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా, అభివృద్ధి సాధిం చాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగా ణ ప్రజలను ప్రభుత్వం అందించే రాయితీల పట్ల ఎదురు చూసే విధంగా గత ప్రభుత్వం తయారు చేసింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయానికి గిట్టుబాటు ధర కల్పించడం, 24 గంటల ఉచిత కరెం ట్, రైతు బీమా, రైతుబంధు, పథకాలు నిరంతరం అమలయ్యే విధంగా  చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. 

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు నూటికి నూరు శాతం అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనిని పటాపంచలు చేయాలంటే ప్రభుత్వ అనుసరిస్తున్న విధానంలో మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజ లు, వారికున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు పాలనాపరమైన వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి.

ముందుగా మౌలి క వసతుల కల్పన ప్రధానంగా చేపట్టాలి. విద్య, వైద్య రంగాలను కూడా బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంటే ప్రజల దృష్టి మళ్ల్లుతుంది. సెంటిమెంట్ రాజకీయాలు అమ లు చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తున్నాయి.

కేంద్రంనుండి ఆర్థిక సాయం అం దకపోవడం వల్ల ప్రభుత్వ నిర్వహణకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే. అయితే ఈ విషయాన్ని ప్రజ లు పట్టించుకోరు. మనం ఏం చేస్తున్నాం అన్న విషయం పైనే ప్రజలు ఆలోచిస్తారు.  ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయా లు మలుపు తిరగకముందే ప్రభుత్వం జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.