04-01-2026 12:21:51 AM
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): ప్రభుత్వాస్పత్రుల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత డాక్టర్లు ఉండంటం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నిమ్స్ ఆస్పత్రిపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై మంత్రి దామోదర రాజన ర్సింహ సమాధానం ఇవ్వడానికి ముందు చైర్మన్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైనా వైద్యం అందించాలంటే జిల్లా అస్పత్రులను అభివృద్ధి చేయాలన్నారు. ఆ విధంగా చేస్తే నిమ్స్‌పై ఒత్తిడి తగ్గుతుందని మంత్రికి సూచించారు.
ఉద్యోగాలు పొందే వైద్యులు కచ్చితంగా ఒక ఏడా ది గ్రామీణ ప్రాం తాల్లో పనిచేయాలని, ప్రభుత్వా స్పత్రుల్లో పనిచేసే వారికి ప్రోత్సహకాలను ప్రభుత్వం అందించాలని సూచించారు. వేలాది ప్రభుత్వ స్కూళ్లలో లైబ్రేరియన్లు లేరని, ఆటలు ఆడించేందుకు పీఈటీలు లేరని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోసు శ్రవణ్ ప్రస్తావించిన అంశంపై చైర్మన్ స్పందిస్తూ.. సాయంత్రం నాలుగు దాటితే బడుల్లో టీచర్లు ఉండట్లేదని, ఇక పీఈటీలు పిల్లలకు ఆటలెలా ఆడిస్తారని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగి బాధ్యతగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నా రు. అలాగే కంటి వెలుగు మంచి కార్యక్రమమని, దాన్ని గ్రామాల్లో అమలు చేయాలని మంత్రిని కోరారు.