calender_icon.png 21 May, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన భోజనం పెట్టలేరా?

29-11-2024 12:00:00 AM

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో, గిరిజన వసతి గృహాల్లో ఇటీవలి కాలంలో మధ్యాహ్న భోజనంలో తలెత్తిన లోపాలవల్ల అనేకమంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ వున్నారు. కొందరు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగాగల అన్ని రకాల సంక్షేమ హాస్టళ్లలో శుచి, శుభ్రత లేకపోవడం, భోజన పదార్థాలలో నాణ్యత పాటించక పోవడం వంటి ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులు పురుగుల అన్నం తిని తనువు చాలిస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రభుత్వం ఇప్పటికైనా విషయాన్ని సీరియస్‌గా తీసుకొని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ, గిరిజన వసతి గృహాలు, కస్తూర్బా, మోడల్ స్కూళ్లలో, ఇంకా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పూర్తి నాణ్యతతో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. 

- కామిడి సతీశ్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా