14-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి, జూలై 13 (విజయ క్రాంతి): మాదకద్రవ్యాల వినియోగంపై విస్తృత ప్రచారం అవసరమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆరట్స్, సైన్స్ డిగ్రీ కాలేజీలో నషాముక్త్ భారత్ అభియాన్ సాముహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మహిళలు, పిల్లలు వికలాంగుల, వయోవ్రద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి, సామూహిక అవగాహన కల్పించే లక్ష్యంతో, సామాజిక న్యాయం, సాధికారత శాఖ దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ అభియాన్ (NMBA) ను అమలు చేస్తుంది.
ప్రధానంగా ఈ ప్రచారం యొక్క ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, విద్యార్థులు, యువత , మహిళలు, ఉద్యోగులు, ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆగష్టు 13 నాటికి 5 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ భవిష్యత్ లో సక్రమమైన దారిలో నిర్మిచుకోవాలని సూచించారు.
అదే విధంగా చాలా మంది యువకులు మాధక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటు న్నారు. అని మన తెలంగాణ ప్రభుత్వం మాధక ద్రవ్యాలను వినియోగం కట్టడి చేయడం కొసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు.
అదే విధంగా జిల్లాలో మాధక ద్రవ్యాలను వినియోగం తగ్గించడానికి జిల్లా సంక్షేమ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ , జిల్లా సంక్షేమ ఆధికారి ప్రమీల, ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంత రావు, డిగ్రీ కళాశాల విద్యార్థిని , విద్యార్థులు పాల్గొన్నారు.