14-08-2025 10:38:41 PM
ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు..
మిడ్జిల్ (విజయక్రాంతి): వర్షాల కారణంగా మిడ్జిల్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శివనాగేశ్వర్ నాయుడు(SI Shiva Nageshwar Naidu) సూచించారు. గురువారం వారు మాట్లాడుతూ, ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని తెలిపారు. రైతులు, ప్రజలు విద్యుత్ స్తంభాలకు విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనదారులు రోడ్డు మీద అత్యంత వేగంగా ప్రయాణించవద్దన్నారు. గ్రామాల్లో కల్వర్టుల పరిసర ప్రాంతాల్లో ఉండవద్దని కొందరు యువకులు చెరువులు వాగులు ఈతకు చేపలు పట్టేందుకు వెళ్లవద్దని సూచించారు.