14-08-2025 10:19:23 PM
కోదాడ: రాష్ట్రంలోని పీఏసీఎస్ పాలకవర్గాల పదవీ కాలం ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ఎమ్మెల్యే పద్మావతి(MLA Padmavathi)ని కలిసి పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. పదవీ కాలం పొడిగింపులో కీలకంగా వ్యవహరించిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలు శాఖల మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ సొసైటీ వైస్ చైర్మన్ బుడిగం నరేష్ పాల్గొన్నారు.