14-08-2025 10:36:06 PM
అదిలాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేసిన ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వా తీరును ఖండిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీఆర్ చౌక్ లో గురువారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఓటు చోరీ చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని గద్దదించేలా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పోరాటాన్ని సంఘీభావం పలకాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీకి మద్దత్తుగా అదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ నిరసన చేపట్టాడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధర్మపురి చంద్రశేఖర్, సురేష్, రహీం ఖాన్, గౌతమ్, నవీన్ రెడ్డి, చారి, రాజన్న, అప్సర్ ఖాన్, గంగన్న, అలీమ్ ఖాన్, మహేందర్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.