calender_icon.png 15 August, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు పెంచాలి.. కాలుష్యాన్ని నివారించాలి

14-08-2025 10:14:13 PM

మొక్కలతో పర్యావరణ పరిరక్షణ..

గరిడేపల్లి (విజయక్రాంతి): మొక్కల ఎదుగుదలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు పెంచి కాలుష్యాన్ని నివారించాలని గరిడేపల్లి ఎంపీడీవో సరోజ(MPDO Saroja) కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో గురువారం హరితహారం పథకంలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తమ ఇండ్లలో మొక్కలు పెంచాలని సూచించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ కాలుష్యం నివారణ కోసం, భావితరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు మొక్కలను పెంచాలన్నారు.

కేవలం ఇండ్లలోనే కాకుండా పంట పొలాలలో కూడా అందరు మొక్కలు నాటాలని కోరారు. ప్రభుత్వం నర్సరీల ద్వారా పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఇతర మొక్కలను పెంచి ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మొక్కలు పెంచి కాలుష్యాన్ని నివారించేందుకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, మాజీ పి.ఏ.సి.ఎస్ చైర్మన్ బండా నర్సిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్ శిరీష, మేకపోతుల సరిత గౌడ్, సతీష్, రావుల వెంకన్న, సుధీర్ రెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.