10-08-2024 11:25:22 AM
శ్రీకాకుళం: టెక్కలిలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య వాణి, పిల్లల నిరసన కొనసాగుతోంది. భార్య వాణి, పెద్ద కుమార్తె హైందవి రాత్రంతా దువ్వాడ ఇంటి ఆరుబయటనే నిద్రించగా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లొనే ఉన్నారు. సమస్యకు పరిష్కారం లభించేంత వరకూ ఇక్కడే ఉంటామని భార్యాబిడ్డలు తేల్చి చెప్పారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను అర్ధరాత్రి వేరే మహిళతో దొరికాడు. దీంతో భార్య నిలదీసింది. కోపంతో ఊగిపోయిన శ్రీనివాస్ భార్య, పిల్లల పై పచ్చి బూతులు తిడుతూ, రాడ్డు తీసుకుని దాడిచేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. అటు ఇంటిగేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నం చేశారని తన భార్య వాణి, కుమార్తె హైందవితో పాటు మరికొందరిపై ఎమ్మెల్సీ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.