07-11-2025 12:40:33 AM
జనగామ, నవంబర్6 (విజయక్రాంతి): మండలాలవారీగా రహస్య సమావేశాలు బీసీల మద్దతు కూడగడుతున్న నాగపురి కిరణ్ గౌడ్ జనగామ కాంగ్రెస్లో రోజురోజుకు పరిమాణా లు మారుతున్నాయి. కొన్ని రోజులుగా డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి పై కొందరు నాయకులు కార్యకర్తలు తిరుగుబాటు చేస్తుండగా ఇదే అదునుగా కొందరు నేతలు డిసిసి కూర్చుని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా రు. తాజాగా పలు మండలాల కార్యకర్తలు కొమ్మూరిని డిసిసి పదవి నుంచి తప్పించాలని ఏకంగా గాంధీ భవన్ లో హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు.
ఈ పరిమాణాలను కొందరు నేతలు తనకు సానుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనను తప్పిస్తే డిసిసి అధ్యక్ష పదవి ఇంకా ఎవరికి ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కుర్చీ కోసం స్టేషన్ ఘన్పూర్ ఇన్చార్జి ఉన్న సింగపురం ఇదిరా, పాలకుర్తి ఇన్చార్జి ఉన్న జాన్సీ రెడ్డిని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే తరుణంలో తాజాగా బీసీ నినాదం తెరపైకి వస్తుంది. జనగామ డిసిసి అధ్యక్ష పదవిని బీసీలకే కేటాయించాలని ఆ వర్గానికి చెందిన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. బీసీల అందర్నీ చేర్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ కుమారుడు, కాంగ్రెస్ జిల్లా నేత నాగపూర్ కిరణ్ గౌడ్ ఏకం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఝాన్సీ రెడ్డి సమాలోచనలు మొన్నటి వరకు డిసిసి అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించిన ఝాన్సీ రెడ్డి సమాలోచన ఇస్తున్నట్లు తెలిసింది. పాలకుర్తి నియోజకవర్గం లోని కార్యకర్తలు డిసిసి అధ్యక్ష పదవి తీసుకోవద్దని వెళ్లిబూచినట్లు సమాచారం.
ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండగా ఆమె కోడలు యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ పార్టీ వ్యవహారాలన్నీ ఝాన్సీ రెడ్డి చూసుకుంటున్నారు. డిసిసి అధ్యక్ష పదవి దక్కితే పాలకుర్తి నియోజకవర్గం దూరం అవుతారని. పార్టీ బలహీన పడుతుందని, వారిస్తున్నారు. ఈ అంశంపై ఝాన్సీ రెడ్డి సమ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. రేసులో నాగపురి డిసిసి అధ్యక్ష పదవి బీసీలకే ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో తెరపైకి నాగపురి కిరణ్ గౌడ్ పేరు వస్తుంది. కిరణ్ గౌడ్ తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. జనగామ నియోజకవర్గంలోని పాత చేర్యాల నియోజకవర్గంతో పాటు జనగామ లోను నాగపూర్ కుటుంబానికి సొంతగా కేడర్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిరణ్ గౌడ్ బిఆర్‌ఎస్ లో ఉండగా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఆయనను బుజ్జగించి. పల్లాకు టికెట్ కేటాయించారు.
పల్లా గెలుపులో కిరణ్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన హస్తం పార్టీలోకి చేరారు. దాదాపు పదేళ్లుగా ఆయన వేలాదిమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడంతోపాటు వ్యక్తిగతంగా వేలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు. నిత్యం అన్ని మండలాలలో పర్యటిస్తూ ఇప్పటికీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీసీలకు సంబంధించిన అన్ని కార్యక్రమంలోనూ కిరణ్ గౌడ్ వస్తున్నారు. జనగామలో డీసీసీ అధ్యక్ష పదవి నుంచి కొమ్మూరిని తొలగించాలని. డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కిరణ్ గౌడ్ తనకు పదవి దక్కేల పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అన్ని మండలాల నుంచి కార్యకర్తల మద్దతు కూడగట్టుకోవడమే కాకుండా బీసీలను ఏకం చేస్తున్నారు.
తన తండ్రి రాజలింగం గౌడ్ బడా నేతలతో పరిచయాలు ఉండడంతో హైకమాండ్ తో మంతనాలు జరుపుతున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి తండ్రిని వెంటబెట్టుకొని కిరణ్ గౌడ్ వెళ్లారు. తన బయోడేటా సమర్పించి డిసిసి అధ్యక్ష పదవికి సహకరించాలని కోరారు. మరోవైపు తన పేరును పరిశీలించాలని. రాష్ట్ర హైకమాండ్ ను కోరినట్టు తెలిసింది. స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్య, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సహకారం తీసుకుంటున్నారు.