07-11-2025 12:44:06 AM
సీనియర్ నాయకుడు ఆళ్ల పురుషోత్తం ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఆళ్ల పురుషోత్తం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర, గడపగడప ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ జీహెచ్‌ఎంసీ శంకర్ యాదవ్, కార్పొరేటర్ లాల్సిం గ్, దర్షన్ కృష్ణ, గువ్వల్ల బాలరాజ్ పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా ఆళ్ల పురు షోత్తం ప్రజలను కలుసుకుని కేంద్ర ప్రభు త్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి యాత్రను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.