19-11-2024 12:00:00 AM
చిన్నప్పుడు బంధాలు కూడా కలకలం కొనసాగే అవకాశాలుంటాయి. హైస్కూల్ పరిచయాలు లోతైన స్నేహం, భావోద్వేగ అనుబంధానికి దారి తీస్తుంటాయి. అయితే హైస్కూల్ బంధాలు ఎక్కువ కాలం కొనసాగే వీలున్నప్పటికీ.. వీడిపోయే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తోంది. ఎక్కువ సంబంధాలు కొద్దికాలంలోనే మసకబారుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నా రు. స్కూలింగ్‌లో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ఆ తర్వాత ప్రేమకు దారితీస్తుంటుంది.
ఒకే పాఠశాలలో ఏళ్లపాటు చదవడం వల్ల ఇద్దరి మధ్య సదాభిప్రాయం కలుగుతుంది. అయితే హైస్కూల్ తర్వాత కళాశాలకు వేళ్లే క్రమంలో ఇద్దరి అభిరుచులు, అలవాట్లు మారుతుంటాయి. విద్యాపరంగా, కెరీర్ పరంగా విభిన్న నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తల్లిదం డ్రుల నిర్ణయాలను గౌరవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కాలేజీ కెరీర్ మొదలవుతుందో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుంటాయి. ప్రత్యే కించి కళాశాల జీవితం వేర్వేరు దిశల్లో నడిపిస్తుంది. ఈ కారణాలు హైస్కూల్ బంధంపై తీవ్ర ప్రభావం పడేలా చేస్తున్నాయి. ఇద్దరు వేర్వేరు లక్ష్యాలవైపు వెళ్తున్నప్పుడు హైస్కూల్ సంబంధాలను కొనసాగడం కష్టంగా మారుతుంది.