calender_icon.png 26 September, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిక్కు తగ్గేనా?

26-09-2025 12:56:01 AM

 - నేటి నుంచి వచ్చే నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణ

- మహబూబ్ నగర్,నారాయణ పేట జిల్లాలో 90 షాపులు 

- రెండు జిల్లాలో 27 షాపులకు రిజర్వేషన్

- సిండికేట్లు పెరిగే అవకాశం.. సన్నద్ధమవుతున్న ఆశావాహులు

- పక్కాగా నియమ నిబంధనలు : సుధాకర్, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి, మహబూబ్ నగర్ 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): మద్యం షాపులకు కిక్కు తగ్గే నా.? అంటే మార్కెట్ వర్గాలు ఇది నిజమే అనే అనుమానాలకు తావిస్తుంది. గతంలో నిర్వహించిన డివి చెల్లింపుల్లో ఒక దరఖాస్తుకు రూ 2 లక్షలు ఉన్నప్పటికీ ఈసారి రూ 1లక్ష పెంచి రూ 3 లక్షలు ఖరారు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు మద్యం షాపుల ను దక్కించుకునేందుకు ఆశిస్తున్న వారి నుం చి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

మహ బూబ్ నగర్, నారాయణ పేట జిల్లాల వ్యా ప్తంగా 90 షాప్ లకు టెండర్లు ఆహ్వానించగా 27షాపులను ఎస్సీ,ఎస్టీ, గౌడ్లకు రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఏ మేరకు పగటిపత్తిగా ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికా రులు సన్నద్ధమవుతుండ్రు. ఈ అంశంపై జి ల్లా కలెక్టర్ విజయేందిర బోయి తో సంబంధిత అధికారులుసంబంధిత అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు ప్రత్యేకంగా చర్చించారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుం డా పక్కగా ప్రక్రియను పూర్తి చేయాలని జి ల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించిన్రు. ఈ మే రకు ఎక్సైజ్ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రక్రియను వేగవంతంగా ముం దుకు తీసుకుపోతుంది. 

- ఆశించిన మేరకు ఆదాయం సమకూర్తుందా ...

 ప్రభుత్వం పకడ్బందీగా మద్యం షాపుల నుంచి అత్యధికంగా ఆదాయం వస్తుందని అంచనాలు వేయడం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆశించిన మేరకు దరఖాస్తులు ఎక్కు వగా వస్తే ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం సమకురానున్నది. మద్యం షాపులను దక్కించుకోవడంలో చాలామంది ఆశిస్తున్నప్పటికీ లక్ష రూపాయల పెంపు ఒకమారు ఆలోచన చేసే విధంగా చేసింది. దీంతో సిండికేట్లు మరింతగా పెరిగి ఆయా షాపులను దక్కించుకోవడంలో ఆత్రుత కనబరుస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 30-11-2027 వరకు మద్యం షాపులు దక్కించుకున్న వారికి ఈ సమయంలో నడిపించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. 


నిబంధనల మేరకు ప్రక్రియ...

 ప్రభుత్వ నియమ నిబంధనలు అమలు చేస్తూ మహబూబ్ నగర్, నారాయణ పేట జిల్లాలో మద్యం షాపులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. దరఖాస్తు ధరలు నిబంధనలు పాటిస్తూ సన్నధం కావాలి. ఆశవాలు నిర్ణయించిన సమయంలో దరఖాస్తులు చేసుకోవాలి. 

                                   సుధాకర్, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి, మహబూబ్ నగర్