09-12-2025 01:23:46 AM
టీ20 వరల్డ్‌కప్ స్ట్రీమింగ్ నుంచి ఔట్
ముంబై, డిసెంబర్ 8 : టీ ట్వంటీ ప్రపంచకప్ 2026కు ముందు ఐసీసీకి ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ స్ట్రీమింగ్ నుంచి జియో హాట్‌స్టార్ తప్పుకోబోతోంది. ఆర్థిక నష్టాల కారణంగా కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఐసీసీకి కూడా జియో హాట్‌స్టార్ వ ర్గాలు తెలియజేసినట్టు వార్తలు వస్తున్నాయి.
భారత్‌లో స్ట్రీమింగ్ హక్కుల కోసం జియో 2024 మధ్య కాలానికి గానూ సుమా రు 3 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. అయితే ఇంకా రెండేళ్ల ఒప్పందం మి గిలుండగానే తప్పుకోవాలని డిసైడయింది. స్ట్రీమింగ్ ద్వారా గత ప్రపంచకప్ నుంచీ భారీగా నష్టాలు రావడమే దీనికి కారణం. వ్యూయర్‌షిప్ అనుకున్నంత రాకపోవడం, డాలర్ రేటు పెరగడం, యాడ్ రెవెన్యూ తగ్గిపోవడంతో దాదాపు రూ.7 వేల కోట్ల వర కూ నష్టమొచ్చినట్టు అంచనా.
ప్రస్తుతం ఎదురవుతున్న నష్టాలతో ఇక కొనసాగలేమని ఐసీసీకి జియో స్పష్టం చేసినట్టు తెలు స్తోంది. జియో హాట్‌స్టార్ నిర్ణయంతో ఐసీసీ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. 2026 29 కాలానికి గానూ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, సోనీ లివ్ వంటి సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. కనీసం 2.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఐసీసీ ఆశిస్తోంది. అయి తే బిడ్డింగ్ ధర ఎక్కువగా ఉండడంతో ఓటీ టీ సంస్థలు ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతోంది.
గేమింగ్ కంపెనీలపై నిషేధం విధిం చడంతో యాడ్ రెవెన్యూ బాగా తగ్గిపోయింది. ఇదిలా ఉంటే జియో హాట్‌స్టార్ నిర్ణ యం సామాన్య అభిమానులకు కూడా షాక్‌గానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకూ మొబైల్ రీఛార్జీతో, ఇతర ఆఫర్లతో ఉచితంగా ఈ మ్యాచ్‌లు వీక్షించేవారు. ఇప్పుడు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఇతర సంస్థలు స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకుంటే వాటికి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించాల్సిందే.