09-12-2025 02:24:21 AM
మాదాపూర్, సుచిత్రలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): ఐఐటీ, జెఈఈ, నీట్ ప్ర వేశపరీక్షల్లో తర్ఫీదుతో పాటు విద్యార్థులను అద్భుతమైన ఇంజినీర్లు, డాక్ట ర్లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో హైదరాబాద్ కేంద్రంగా విద్యాసంస్థ విద్యా మందిర్ క్లాసెస్ ప్రారంభమైంది. మా దాపూర్, సుచిత్రలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్‌తో పాటు ఐఐ టీ, నీట్ కోచింగ్ కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించింది. బేగంపేట్ గ్రీన్ పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ కార్యకపాలను డీఆర్డీఓ మాజీ ఛైర్మన్ జి సతీష్‌రెడ్డి ప్రా రంభించారు.
ఆయన మాట్లాడుతూ.. వీఎంసీ అద్భుత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కేవలం ఐఐటి యన్స్, డాక్టర్లను మాత్రమే కాకుండా విద్యాసంస్థలు, దేశానికి అవసరమైన వృత్తి నిపుణులను తయారు చేయాలని పిలుపునిచ్చారు. విద్యామందిర్ క్లాసెస్ సీఈఓ కౌశిక్ మిశ్రా మాట్లాడు తూ.. హైదరాబాద్ కేంద్రంగా వీఎంసీ వేలాది విద్యార్థులు, తల్లిదండ్రల కళలను సాకారం చేస్తుందని ఆకాంక్షించా రు.
దక్షిణ భారత దేశంలో తొలిసారిగా మాదాపూర్, సుచిత్రల్లో వీఎంసీ ఐఐటీ జేఈఈ, నీట్ తో ఇంటర్ విద్య ను అందించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఎంసీ పుస్తకాలు, యూనిఫాం, కళాశాల డిజిటల్ వీడియోను ఆవిష్కరించారు. సింబయా సిస్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ రజనీకాంత్, జీవీకే రెడ్డి, వీఎంసీ ఉపా ధ్యక్షులు ప్రతీక్ భట్టాచార్య, దక్షిణాది హెడ్ గౌస్, ఏపీ, తెలంగాణ హెడ్ శైలజా, వీఎంసీ హైదరాబాద్ డైరెక్టర్లు గౌతమి రెడ్డి, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.