20-07-2025 12:00:00 AM
డాక్టర్ ఎస్ విజయభాస్కర్ :
పదిహేను, ఇరవై సంవత్సరాలుగా ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయని ఆశపడుతున్న సమయంలో ఆటంకాలు కలిగించడం శోచనీయమని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దశాబ్ద కాలం నుంచి ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు లేక, ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు లేక అనేక పాఠశాలలు మూతపడ్డాయి.
విద్యా సంవత్సరం 2025-26లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపా ధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు ప్రశ్నార్థకంగా మారాయి. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు చేపట్టేందుకు సీనియారిటీ లిస్ట్ తయారు చేసింది. కొంత మంది సీనియర్ ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియ చేపట్టి పదోన్నతులు ఇవ్వాలని కోరడంతో పదోన్నతుల విషయంలో వి ద్యాశాఖ డోలాయమానంలో పడింది.
ముందు పదోన్నతులు ఇవ్వడంతో జూనియర్లకు మంచి పోస్టింగ్‌లు దక్కి, సీనియర్ల కు అన్యాయం జరుగుతుందని సీనియర్ ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల కానుండటం తో ఎలక్షన్ కోడ్ వల్ల ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యా యులకు పదోన్నతులు, బదిలీలు జరగడం అసాధ్యం అని కొందరు భావిస్తున్నారు.
కేంద్రప్రభుత్వం జనగణన కోసం ఉత్తర్వు లు జారీ చేయడంతో 2027 వరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టడమనేది అసం భవమని పేర్కొంటున్నారు. రాష్ట్రప్రభు త్వం నూతన విద్యా విధానం-2020 (ఎన్‌ఈపీ) అమలు చేయాలని చూస్తున్న తరుణంలో ఎన్‌ఈపీ అమలు చేస్తే పదోన్నతు లు ఏ విధంగా ఇస్తారోనని ఉపాధ్యాయు లు ఆందోళన చెందుతున్నారు.
సర్దుబాటు అనే పేరుతో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అదే జిల్లా పరిధిలో బదిలీలు చేసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం ఆ యా జిల్లాల కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టింది. దీని ప్రకారం ఇక ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడినట్టేనని కొందరు భావిస్తు న్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన రాష్ట్రవిద్యాశాఖ ప్రభు త్వ, పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వారం రో జుల్లో పూర్తి చేయవచ్చని పేర్కొంటున్నారు.
కొందరి ఆటంకాలు..
కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు కావాలనే ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీ లు, పదోన్నతులకు ఆటంకం కలిగిస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. గత పదిహే ను, ఇరవై సంవత్సరాలుగా ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయని ఆశపడుతున్న సమయం లో ఆటంకాలు కలిగించడం శోచనీయమని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
దశాబ్ద కాలం నుంచి ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు లేక, ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు లేక అనేక పాఠశాలలు మూతపడ్డాయి. కాంగ్రె స్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే వేసవి సెలవుల్లోనే మండల కేంద్రాలకు పాఠ్య పుస్తకా లు, నోట్‌పుస్తకాలు, యూనిఫాంలను చేరవేసింది.
పాఠశాలల్లో కంప్యూట ర్, ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించింది. బడుల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసింది. బడులకు ఉచితంగా కరెంట్ కూడా సరఫరా చేస్తున్నది. ఈచర్యల కారణంగా ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలను మాన్పిం చి, ప్రభుత్వ బడుల్లో చేర్చారు. కొన్ని జిల్లా ల్లో ప్రభుత్వ పాఠశాలల ఎదుట ‘అడ్మిషన్లు పూర్తయ్యాయి’ అనే బోర్డులు కనిపిం చడం విశేషం.
కొందరు తల్లిదండ్రులైతే.. శాసనమండలి, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి కూడా సిఫారసు లేఖలు తీసుకొచ్చి, అడ్మీషన్ల కోసం ప్రధానోపాధ్యాయులను బతిమిలాడిన సందర్భాలు మనకు కనిపించాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు బాసర, మహబూబ్‌నగర్ ఐఐఐటీ క్యాంపస్‌ల్లో సీట్లు సాధించడం, పాలిటెక్నిక్ కళా శాలల్లో సీట్లు పొందడం కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతో ఆకర్షిస్తున్నది.
అలాగే సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీ సుకుని మున్సిపల్, పంచాయతీరాజ్, రెసిడెన్షియల్, మోడల్ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తద్వారా విద్యావ్యవస్థ గాడిన పడింది. పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన, ఈబీసీ వర్గాల కు చెందిన ప్రజలు సర్కార్ బడుల్లో తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఆనందపడుతున్నారు. ఇక ఉపాధ్యాయు ల బదిలీలు, పదోన్నతులు చేపడితే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది.
మారిన ‘రెసిడెన్షియల్’ రూపురేఖలు
గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలంటూ ప్రైవేటు భవనాల్లో తరగతులు నిర్వహించేది. కుల, మతాల ప్రాతిపదికన విడదీసి విద్యార్థులకు విద్య అందించేందుకుఇ. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్నది. 2025--26 విద్యాసంవత్సరం నుంచి సొంతంగా నిర్మించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు కలిసి మెలసి చదువుకునేలా ప్రణాళికలు రచిస్తున్నది.
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన లో నాటి ప్రభుత్వం 1/2005 యాక్ట్ తీసుకొచ్చి భాషా పండితులకు అన్యాయం చేసింది. దీంతో మున్సిపల్, జడ్పీ పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ బోధించే ఉపాధ్యాయులు (భాషా పండితులు) చాలీచాలని వేతనాలు తీసుకునేవారు. వచ్చే ఆ జీతంతోనే వారి కు టుంబాలను పోషించుకునే వారు. పిల్లలను చదివించుకునేవారు. ప్రస్తుత ప్రభు త్వ పాత యాక్టును రద్దుచేసేందుకు ఎంతో కృషి చేసింది.
సుప్రీం కోర్టు కూడా భాషాపండితుల న్యాయమైన కోరికైన సమాన పనికి సమాన వేతనాని అమలు చేయాలని ఆదేశించడంతో వారి సమస్యలకు ప రిష్కారం లభించింది. దీంతో భాషోపాధ్యాయులకు రాష్ట్రప్రభుత్వంపై ఎనలేని నమ్మ కం ఏర్పడింది. రాష్ట్రప్రభుత్వ ఇదే ఒరవడిలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మార్గదర్శకాలు విడుదల చేయాలని, జీరో సర్వీస్ కింద, స్థానిక ఎన్నికలకు ముందే బదిలీలు, పదోన్నతులు పూర్తి చే యాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
- వ్యాసకర్త సెల్ - 92908 26988