10-10-2025 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కొంతకాలంగా ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిపై మనసు పారేసుకున్న ట్రంప్ దానికోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. నోబెల్ శాంతి ప్రైజ్‌ను అందుకోవడానికి తాను చేయాల్సిదంతా చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని యుద్ధాలను తానే ఆపానని, అన్ని దేశాల మధ్య శాంతి సామరస్య వాతావరణాన్ని నెలకొల్పడంతో తన పాత్ర కీలకమంటూ బల్లగుద్ది చెప్పుకుంటున్నారు.
‘నాకు శాంతి నోబెల్ ఇవ్వాల్సిందే.. లేదంటే అమెరికాకే అవమానం’ అంటూ డిమాండ్లు, ‘నాకెందుకు ఇస్తారులే’ అంటూ వ్యంగ్యాస్త్రాలు, ‘ఇన్ని యుద్ధాలు ఆపిన మొనగాడు లేడు’ అంటూ ప్రగల్బాలు, ‘ఇంత చేసినా నాకు శాంతి బహుమతి రాదేమో’ అంటూ నిరాశ వ్యాఖ్యలు చేయడం ట్రంప్‌కే చెల్లింది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచంలోని ఎనిమిది యుద్ధాలను తానే ఆపానని జబ్బలు చరుచుకున్నారు. భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ దాదాపు 50 సార్లు పేర్కొనడం గమనార్హం. కానీ ట్రంప్ వాదనను భారత్ ప్రతీసారి ఖండిస్తూనే వచ్చింది.
ట్రంప్ యుద్ధాలు ఆపానని చెప్పుకున్న జాబితాలో ఇజ్రాయెల్ భారత్ రువాండా ఆఫ్ కాంగో, థాయిలాండ్ ఆర్మేనియా ఈజిప్ట్‌ఇథియోపియా, సెర్బియాెేకొసావో, ఇజ్రాయెల్‌హమాస్ ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం సందర్భంగా యుద్ధం ఆపేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నట్లు తెర ముందు చెబుతూనే.. తెర వెనుక మాత్రం ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలు నాశనమయ్యేదాకా ట్రంప్ తన పంతం వీడలేదు.
ఇజ్రాయెల్‌తో సంధికి రాకపోతే ఇరాన్ అంతుచూస్తామని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. తాజాగా ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంలో తనదే కీలకపాత్ర అని ట్రంప్ పేర్కొన్నారు. 20 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తూనే మరోవైపు హమాస్‌కు డెడ్‌లైన్ విధించడం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో దగ్గరుండి ఖతార్ నేతకు క్షమాపణలు చెప్పించడంతో పాటు హమాస్‌తో సంధికి రావాలం టూ పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
మొత్తంగా తనకు శాంతి బహుమతి రావడం కోసం దేనికైనా సిద్ధమనే ధోరణి ట్రంప్‌లో కనిపిస్తుం ది. ఎనిమిది యుద్ధాలు ఆపానని ప్రగల్బాల పలికిన ట్రంప్ రష్యా, ఉక్రెయి న్ మధ్య యుద్ధం ఆపడంలో విఫలమయ్యారు. యుద్ధం ఆపేందుకు శతవిధాల ప్రయత్నించానని, కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరిని అర్థం చేసు కోలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక తన మాట వినని దేశాలపై సుంకాల మోతతో ట్రంప్ కఠినాత్మక వైఖరిని ప్రదర్శించారు.
తన చేష్టలతో ప్రపంచ దేశాలను ఇబ్బందుల్లోకి నెట్టేసిన ట్రంప్ నిజంగా నోబెల్ బహుమతికి అర్హుడేనా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌తో పాటు 338 మంది పోటీ పడుతున్నారు. ఈసారి రేసులో ట్రంప్‌తో పాటు దివంగత పోప్ ఫ్రాన్సిస్, మస్క్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ ఆంటోనియో గుటెర్రెస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.‘ప్రపంచశాంతి కోసమే కృషి చేస్తున్నా.. ప్రజలు ప్రాణాలు కాపాడటమే నాకు అసలైన నోబెల్’ అని పేర్కొన్న ట్రంప్‌కు నిజంగా నోబెల్ వస్తుందా? రాదా అన్నది నేటితో తేలిపోనుంది.