10-10-2025 12:00:00 AM
ఈ మధ్య కాలంలో వివాహబంధంపై చాలా మందిలో దురభి ప్రాయం వచ్చిందనడానికి సవాలక్ష కారణాలు కనిపిస్తున్నాయి. పరిసరాల ప్రభా వం, నిర్లిప్త ధోరణి, దేనిపట్ల స్పందించని మనస్తత్వం, మంచి చెడులను విశ్లేషించలేకపోవడం, సామాజిక సమగ్రత పట్ల కనీస అవగాహన లేకపోవడం, కులం, మతం, ప్రాంతం, భాష, సంస్కృతి పట్ల ఏహ్యభావం పెంచుకుంటున్నారు. సమాజ పురోగతికి కారణమైన మంచి మానవ సంబంధాలు లేకపోవడం, అలాగే కూలుతున్న కుటుంబ వ్యవస్థ, ఆర్థిక దిగజారుడు, నీచ సంస్కృతి, అభిప్రాయ బేధాలు, అలవాట్లు, కట్టుబాట్లు, అంతరాలు, మనుషు ల మధ్య విచ్చిన్నానికి కారణమవుతున్నా యి.
కొన్ని సందర్భాల్లో వంధత్వం, ఒత్తిడి, ఆందోళన, కోపం, చిరాకు అనారోగ్య కారణాలు శాశ్వత బంధానికి ముగింపు పలుకు తున్నాయి. ఇక్కడ పెళ్లి చేసుకుని విదేశాల కు తీసుకెళ్లడం అక్కడ వారి నిజస్వరూ పం తెలిసినా సర్దుకుపోవడం లేదా విడాకులు తీసుకోవడం జరుగుతుంది. స్త్రీలలో ఎక్కువగా ఫ్రిజిడిటీ లేదా లైంగిక ఆసక్తి లేకపోవడాన్ని (లైంగిక ఉదాసీనత) లేదా తగి న పరిస్థితులు లైంగిక సంతృప్తి పొందలేకపోవడానికి సూచిస్తుంది. దీన్ని ‘హైపోగై నస్మస్ అంటారు. మానవ సంబంధాలు అంటే వ్యక్తులు ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తారో తెలిపే పరస్పర చర్యలు.
ఇవి స్నేహం, ప్రేమ, ఆత్మీయత, అప్యాయత వంటి భావనలను కలిగి ఉంటాయి. పనిప్రదేశంలో సామాజిక సంబంధాలపై పరిశోధన చేసే ‘హ్యూమన్ రిలేషన్స్’ అనే రంగంలో, మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడం, వ్యక్తిగత వృత్తిపరమైన సంబం ధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడతారు. కుటుంబ సభ్యుల వల్ల ప్రయోజనం పొందుతూ, వారి గురించి ఆలోచన చేయ క, ఇతర ఆలోచనల వైపు దృష్టి సారించడం సమస్యకు మూలంగా మారుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవడం, అహంకారం అనే ఆలోచనలు మొలకెత్తడం ద్వారా కుటుంబసభ్యుల మధ్య బంధాలు దెబ్బతినే ప్రమాదముంది. మన కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ముందు మనవాళ్లపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరముంది.
హత్యలకు దారి
కానీ నేటి సమాజంలో ఈ ధోరణి కనిపించడం లేదు. ప్రతి రోజు కేరళ నుంచి కాశ్మీర్ వరకు జరుగుతున్న ఉదంతాలు చూస్తుంటే ఇది నిజమనిపిస్తుంది. ఈ రోజుల్లో సమాజంలో భార్య భర్త విడాకు లు తీసుకోవడం, అక్రమ సంబంధాలు వంటివి పెరిగిపోయాయి. నిరాదరణకు గురవుతున్న బాలికలు, మహిళల సంఖ్య కూడా ఎక్కువవుతూ వస్తుంది. ఆడపిల్లల కు ఇంట్లోనే వరుసకు సోదరుడు నుంచి తండ్రి వరకు లైంగికంగా వేధిస్తున్నా ఎవరి కి చెప్పుకోలేని దుస్థితి ఏర్పడింది.
విడాకులు, అక్రమ సంబంధాల వల్ల కుటుంబ వ్యవస్థ కూలిపోవటం, భార్యాభర్తల మధ్య పరస్పర అనుమానాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు, తద్వారా వారి పిల్లలు అనాధలు కావడం వంటి విషాదకర పరిణామాలు ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. క్షణిక సుఖం కోసం అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. రెండు నెలల్లో ముగ్గురు భర్తలను మార్చిన భార్య.. ప్రేమ కాదన్నందుకు పదో తరగతి అమ్మాయి తల్లిని చంపిన ఉదంతం, తల్లీ కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకొని నవ వరుడిని చంపిన సంఘటన, చదువు చెప్పాల్సిన నలభై ఏళ్ల టీచర్ పదవ తరగతి అబ్బాయి తో అక్రమ సంబంధం, ఇటీవల ముగ్గురు పిల్లల తల్లి తన కుమార్తెతో వివాహం నిశ్చయమైన 24 సంవత్సరాల వ్యక్తితో లేచి పోవడం లాంటి దారుణాలు నిత్యం చూస్తూనే ఉన్నాం.
సాటి మనుషులను క్రూరంగా హత్యచేసేవరకు అక్రమ సంబంధాల నేపథ్యం దారి తీసింది. ఉదాహర ణకు హైదరాబాద్‌లో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా నరికి చంపి కుక్కర్లో ఉడకబెట్టడం, మరొక వ్యక్తి భార్యను చంపి మోరీలో పడేసి సిమెంట్‌తో కప్పేయడం చూస్తుంటే ఒళ్లు జలదరించడం ఖాయం. అక్రమ సంబంధంతో సుఖ పడాలనే నెపంతో కన్నతల్లే తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంప డం అమానుష ఘటనగా పేర్కొనవచ్చు. ఈ అక్రమ సంబంధాల నెపం రాజకీయ నాయకుల కుటుంబాల్లోనూ అలజడి రేపింది.
సోషల్ మీడియా ప్రభావం
ఇప్పుడు తమ సమీప ప్రాంతాల్లో ఇలాంటి నేర ప్రవృత్తి పెరిగిపోవడం దాని కి పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం అన్నీ సమానంగా ఉంటున్నాయి. మనిషిని అంతమొందించాలంటే ఎలా అని రోజుల తరబడి ఆన్‌లైన్‌లో వెతికి మరీ శిక్షణ తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలవారుగా రూపొందడంలో తల్లిదండ్రులు, సమాజం, నేర్చుకునే విద్య, చదివే పుస్తకాలు, చేసే వృత్తి పాటించే నైతిక విలువలు చాలా ముఖ్యమైనవి. వీటన్నిటికీ దూరమై కేవలం సోషల్ మీడియాలోనే వారి జీవితాన్ని గడుపుతూ పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందలేకపోతున్నారు.
దీంతో వీరంతా ప్రేమ, ఆప్యాయత అనురాగాలకు దూరమవుతున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా బతుకుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు విద్యార్థులకు సబ్జెక్టులపై విషయ అవగాహన కల్పించడం కోసం సామాజిక మాధ్యమం ఉపయోగపడితే పర్లేదు కాని హింసను ప్రేరేపించే ఘటనలను నిషేధించడమే తక్షణ కర్తవ్యం. ఒకప్పుడు విద్యార్థులకు, ఉద్యోగులకు ఏదై నా సృజనాత్మక ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించి మిత్రులతో చర్చించి పరిష్కారం కనుగొనేవారు. కానీ ప్రస్తుతం ఏ సందేహం వచ్చినా ఏ ఆలోచన వచ్చినా దానికి సంబంధించి గూగుల్, యూట్యూబ్‌లో వెతకడం పరిపాటిగా మారింది. మంచితో పాటు చెడును ప్రోత్సహిస్తున్న సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
భోదన అవసరం
బాల్యంలోనే విద్యార్థులకు నైతిక విలువలు, మానవ సంబంధాలు, ప్రేమ, అను రాగం, ఆప్యాయతలు బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. వీటిని విద్యా విధానంలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. విద్యార్థులను, యువకులను ధనార్జక యంత్రాలుగా కాక మాన వీయత కలిగిన పౌరులుగా రూపొందించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. అదే రేపటి తరానికి మార్గదర్శకం. వివాహ వ్యవస్థ, సాంఘిక, సాంస్కృతిక, చట్టపరమైన నిబంధనలతో పాటు సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బంధాన్ని, హక్కులు, బాధ్యతలు ఎత్తి చూపాలి. ఒకరికొకరు మద్దతుగా నిలిచేందుకు, సమాజానికి ఉపయోగపడేందుకు మార్గం సుగమం చేయాల్సిన అవసరముంది.
వ్యాసకర్త సెల్: 9989988912