calender_icon.png 11 November, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలియమ్సన్ దూరం

23-10-2024 12:00:00 AM

పుణే: న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా బెంగళూరు టెస్టుకు దూరంగా ఉన్న విలియమ్సన్‌కు గాయం తగ్గకపోవడంతో పుణే టెస్టుకు కూడా దూరమైనట్లు కివీస్ బోర్డు ప్రకటించింది. శ్రీలంకతో టెస్టు సిరీస్ సందర్భంగానే కేన్ మామకు గాయమైంది. దీంతో ముంబై వేదికగా జరగనున్న మూడో టెస్టుకు కివీస్ బ్యాటర్ అందుబాటులోకి రానున్నాడు. గురువారం నుంచి రెండో టెస్టు మొదలు కానుంది.