calender_icon.png 7 May, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు చుట్టూ తిరిగే కథతో..

23-04-2025 01:15:30 AM

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘తుడరుమ్’. ఇందులో సీనియర్ నటి శోభన ఇందులో మో హన్‌లాల్‌కు జోడీగా నటించారు. తరుణ్‌మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎం రంజిత్ నిర్మాతగా వ్యవహ రించారు. ఈ సినిమాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దీపా ఆర్ట్స్ ద్వారా పీ శ్రీనివాస్‌గౌడ్ ఏప్రిల్ 26న విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రోలర్ కోస్టర్ రైడ్‌గా ఆద్యంతం కట్టిపడేసిందీ ట్రైలర్. మోహన్‌లాల్ ఇందులో టాక్సీ డ్రైవర్‌గా, ఫ్యామిలీ మ్యాన్‌గా అలరించారు. ఓ కారు, ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందిన ట్టు ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షాజీ కుమా ర్; సంగీతం: జేక్స్ బిజోయ్; ఎడిటర్: షఫీఖ్ వీబీ, నిషాద్ యూసుఫ్.