calender_icon.png 7 May, 2025 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాటి ముంజలు వచ్చేశాయ్!

07-05-2025 12:00:00 AM

పోషక విలువలు కలిగిన ప్రకృతి ప్రసాదం 

తిమ్మాపూర్, మే 6 విజయ క్రాంతి : అత్యధిక పోషక విలువలు కలిగిన తాటి ముంజల సీజన్ వచ్చేసింది అలసట నుంచి ఉపశమనం కలిగించే ఆరోగ్యాన్నిచ్చే ముంజలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే..సీజన్ కు తగ్గట్టు ప్రకృతి అనేక పళ్ళను మానవజాతికి అందిస్తుంది. ప్రస్తుతం సమ్మర్ సీజన్ సమ్మర్ అనగానే నోరూరించే మామిడి పండ్లతో పాటు తాటి ముంజలు గుర్తుకొస్తాయి.

పల్లె పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా ముంజలు మనల్ని ఊరిస్తూ ఉంటాయి. వీటిని తాటి ముంజలు నీటి ముంజలు పాల ముంజలు అని ఎలా పడితే అలా పిలుచుకుంటారు. సమ్మర్ లో వీటిని ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.. ఐస్ ఆపిల్స్ అని పిలుచుకునే వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. సమ్మర్ లో మాత్రమే దొరికే ఈ తాటి ముంచాలంటే పిల్లలు ఏంటి పెద్దలు కూడా ఇష్టంగా లాగించేస్తారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామం హైదరాబాదు నుంచి కరీంనగర్ కు వచ్చే రాజీవ్ రహదారిపై ఉన్న మోయతుమ్మెద వాగు బ్రిడ్జి సమీపంలో ముంజలు విక్రయిస్తురులంతో ఎంతో మంది వాహనదారులు ఆగి ముంజలను వాటి రుచి చూశాకే కొనుగోలు చేస్తారు. ఒక్క రేణికుంట తో పాటు కరీంనగర్ పట్టణంలో కూడా గౌడన్నలు ముంజలను తీసుకొచ్చి మార్కెట్ ఏరియాలో విక్రయిస్తుంటారు.

పెరిగిన వేసవి ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ముంజలను కొనుగోలు చేస్తున్నడంతో ఒక నెలలోనే డిమాండ్ పెరుగుతుంది. డజన్ కు 100 రూపాయల చొప్పున విక్రయిస్తున్నప్పటికీ ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజలు తినడానికి ఎంతోమంది ఇష్టపడుతుంటారు. గతంలో ముంజలు ఉన్న ఊళ్ళల్లో ఉచితంగా లభించేది. ఇప్పుడు ప్రజలు ముంజలు పై రుచి ఇష్టంగా చూపడంతో ధరలు పెరిగిపోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు కూడా భారంగా మారింది.

పోషకాలు అధికం.. 

తాటి ముంజల్లో అనేక పోషకాలు కలిగి ఉండడంతో ఉష్ణ తాపాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. డిహైడ్రేషన్కు గురికాకుండా శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని అందించడంతోపాటు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్, సల్ఫర్, కాపర్, ఈ ముంజల్లో అధికంగా ఉండడంతో రక్తహీనతను తగ్గించడం.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.