calender_icon.png 7 May, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.12 కోట్ల భూమికి ఎసరు?

07-05-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను
  2. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్న ఏడీ సర్వేయర్
  3. సర్వే చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం

నిజామాబాద్, మే 6 (విజయక్రాంతి): నిజామాబాద్ నగర శివారులోని మోపాల్ మండలం బోర్గం (పి) గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు సంబంధించిన భూమిగా చెప్పబడుతున్న ఒక ఎకరం 21 గుంటల భూమి విషయమై సంబంధిత అధికారులు దోబూచు లాడు తున్నారు.  తిలా పాపం తల పిడికెడు అన్న విధంగా వీరి ప్రవర్తన ఉంటోంది .

అన్యాక్రాంత మవుతున్న పాఠశాలకు సంబంధించిన గ్రౌండ్ స్థలాన్ని 1000 కి పైగా ఉన్న విద్యార్థుల క్రీడ స్థలంగా పాఠశాల స్థలంలో కలిపి క్రీడ ప్రాంగణంగా మార్చాలని అందుకు సంబంధించి హద్దులు కూడా ఏర్పాటు చేయాలని జడ్.పి.హెచ్.ఎస్ పూర్వ విద్యార్థులు గ్రామస్తులు అధికారులకు పలుమార్లు దరఖాస్తులు ఇచ్చారు.  అధికారులు వారి విజ్ఞా పనలను తుంగలో తొక్కుతున్నారు. 

ఇటీవలే ఆ భూమి తనదని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు సైతం తొలగించి బహిరంగ కబ్జాకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్న అప్పటికిని నవ్వితే నవ్విపోదురు నాకేంటి అన్న తీరుగా యదేచ్చగా ఈ స్థలం కబ్జా జరిగిందని స్థానికులు పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు.  ఈ విషయమై విజయక్రాంతి పలు వార్తలు ప్రచురించింది. 

స్పందించిన జిల్లా కలెక్టర్ మోఖా పైకి వెళ్లి సర్వే జరిపి హద్దులను ఏర్పాటు చేయాల్సిందిగా లెటర్ నంబర్ ఈ2/95/2025/3/6 న ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ స్థలం కబ్జాలో ఉన్న వారు మాత్రం ఈ స్థలం మా పూర్వీకుల ది అంటూ  చెబుతున్నారూ.  మరోపక్క ఈ స్థల రక్షణకై ఉద్యమించిన బీద బలహీన వర్గాలకు చెందిన వారి ఇళ్లపై రెవెన్యూ మున్సిపల్ పోలీసులతో సహా వారి బస్తిపై దాడులకు పాల్పడుతున్నారు. 

అధికార నాయకుల కనుసనల్లోనే కబ్జాలు  జరుగుతున్నాయని కోట్ల విలువ చేసే భూమి పాఠశాలకు చెందకుండా ప్రైవేటు వ్యక్తులు సొంతం చేసుకొని వెంచర్లుగా ఏర్పాటు చేసి ప్లాట్లు వేసి మరి అమ్ముకుంటు దమ్ము చేసుకుంటూన్నట్టు గ్రామస్తులు పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పలుమార్లు ఈ విషయమై ఫిర్యాదులు చేసినప్పటికీని ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చి నేరుగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర సంబంధిత శాఖలకు ఫిర్యాదులు చేసినప్పటికీని సర్వే చేయడానికి ఏడి సర్వే యర్ భూ పరిరక్షణ జాయింట్  కమిటీ కబ్జాకు గురైన స్థలంగా చెప్పబడుతున్న మోఖాపైకి రావడం లేదు.

పలుమార్లు ఏడి సర్వేయర్ రాష్ట్ర అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీని ఏడి సర్వేయర్ దాటవేస్తూ వస్తున్నారు.  అని ఆరోపణలు ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. కేవలం రాజకీయ ఒత్తిడితోనే ఏడి సర్వేయర్ సర్వేకు రావడంలేదని పూర్వ విద్యార్థుల ఆరోపిస్తున్నారు. అసలు బోర్గం  పి గ్రామంలో ఏం జరుగుతోంది .. బహిరంగంగా పట్టపగలు రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి కబ్జాలకు పాల్పడిన వ్యక్తులకు జిల్లా యంత్రాంగం లోని కొందరు అధికారులు ఎందుకు సహకరిస్తున్నారన్న  ప్రశ్నకు సమాధానం లేదు.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ భూమి ప్రభుత్వ రికార్డులో సైతం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ‘భూ‘ భారతి లో సైతం ప్రభుత్వ భూమి గానే రికార్డుల్లో ఉంది.  తాజాగా ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి పేషి కి సిసిఎల్ కమిషనర్ కు లోకాయుక్త కు ల్యాండ్ సర్వే కమిషనర్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు సైతం స్థానికులు పూర్వ విద్యార్థులు దరఖాస్తు చేస్తూ ప్రభుత్వ భూమిని కాపాడవలసిందిగా ఫిర్యాదు చేశా.   

తాజాగా ఈ విషయమై రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ సైతం ఆదేశాలు ఇచ్చి సర్వే చేయమని చెప్పినప్పటికీని ఏడి సర్వేయర్ దాటవేస్తూ పై అధికారుల ఉత్తర్వులను ఆదేశాలను ధిక్కరిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకే వంతన పాడుతూ సర్వేకు రావడం లేదని. స్థలం విషయమై  భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు పూర్వ విద్యార్థులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఈ స్థల రక్షణకై పోరాడుతున్న పూర్వ విద్యార్థులు గ్రామస్తులు తమ ప్రాణాలకు హాని ఉందని ఇటీవల జిల్లా సిపి సాయి చైతన్యకు జిల్లా జడ్జికి సైతం ఫిర్యాదు చేశారు. ఈ భూభాగతంపై ఏడి సర్వేయర్ నిర్లక్ష్యంపై తాజాగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమంలో తిరిగి ఫిర్యాదు చేశారు. 

ఈ బోర్గాం పాఠశాలకు సంబంధించి ఒక ఎకరం 21 గుంటల భూమి విషయమై సదరు నాయకులు ఎవరు కూడా స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను తక్షణమే పాటించి ఏడి సర్వేయర్ ఆర్డిఓ గ్రామస్తుల సమక్షంలో సర్వే నిర్వహించి వాస్తవాలు నెగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.