calender_icon.png 16 July, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ మృతి.. ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్

16-07-2025 12:00:00 AM

  1. యునైటెడ్ ఆస్పత్రి డాక్టర్‌పై అట్రాసిటీ కేసు 
  2. ప్రైవేట్ హాస్పిటల్స్ ఐక్యతకు ప్రత్యేక సమావేశం
  3. టూ టౌన్ పిఎస్‌లో రామ్మోహన్‌పై దాడి చేశారని ఫిర్యాదు 
  4. మంగళవారం ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపీ సేవలు బంద్ చేసి నిరసన 

మహబూబ్ నగర్ జూలై 15 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హా స్పిటల్ లో మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబం ధించిన కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మూత్ర పిండాల కు సంబంధించిన సమస్యతో నా రాయణపేట జిల్లా బోయిన్పల్లి తాండకు చెందిన దేవమ్మ (60) దేవమ్మ ను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యునైటెడ్ ఆస్పత్రిలో చేరారు.

ఈ సమస్య నయం చేసేందుకు గాను ఆపరేషన్ చేయవలసి ఉం టుందని రూ 1 లక్ష చెల్లించాలని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు డబ్బులు ఆస్పత్రిలో చెల్లించాం. మరిన్ని డబ్బులు చెల్లించాలని, ఆపరేషన్ చేసేందుకు గాను కుటుంబ సభ్యులు వ్యక్తికి ఏమైనా అనుకోని సంఘటన జరిగిన ఎలాంటి ఆందోళన చేయమని సంతకాలు చేయాలని కుటుంబ సభ్యులను డాక్టర్లు కోరారు.

ఇంతలోనే డాక్టర్లు అవసరమైన వైద్య సేవలు చేశామని, ఉన్నట్టుండి దేవమ్మ మరణించిందని మృ త్యురాలి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీం తో ఆగ్రహించిన మృత్యురాలి కుటుంబ స భ్యులు ఒకసారి ఆస్పత్రిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టు టౌన్ పోలీసులు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా సోమవారం సాయంత్రం నుం చి అర్ధరాత్రి వరకు మృతురాలికి కుటుంబ సభ్యులను శాంతింప చేసేందుకు ఎలాంటి ఆందోళనలో జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు.

కుటుంబ సభ్యులతో చర్చలు..

మృతి చెందిన మహిళా కుటుంబ సభ్యులతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అ ధ్యక్షులు డాక్టర్ రామ్ మోహన్, యునైటెడ్ ఆస్పత్రి వైద్యులు సమక్షంలో చర్చలు జరిపారు. లక్ష రూపాయల నుంచి పరిహారం అందిస్తామని చెప్పుకుంటూ చివరగా రెండున్నర లక్షల వరకు ఇస్తామని యునైటెడ్ ఆసుపత్రి డాక్టర్లు చెప్పారని కుటుంబ స భ్యులు ఆరోపించారు.

ఈ తరుణంలో ఓ ఒ ప్పంద పత్రం రాసే సమయంలో కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉన్నది ఉన్నట్టు రాయాలని అలా ఎలా రాస్తారని మరో మారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఐఎంఏ అధ్యక్షులు రామ్మోహన్ పై చెప్పులతో దాడి చేశారని పలువురు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రామ్మోహన్ సైతం మా పై దాడులు చేస్తారా అంటూ సోమవారం అర్ధరాత్రి యు నైటెడ్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు.

టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐఎంఎ ఆధ్వర్యంలో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు టూ టౌన్ ఎస్త్స్ర తెలిపారు. మృతి చెందిన మహిళ కుటుంబ స భ్యులు సైతం యునైటెడ్ ఆసుపత్రి వైద్యుడు పై అట్రాసిటీ కేసు పెట్టారు. మా కుటుంబ సభ్యులను చంపుకొని మేము మౌనంగా ఎలా ఉండాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సమస్య వస్తే ఒక్కతాటి పైకి ప్రైవేట్ హాస్పిటల్స్..

ఎలాంటి సమస్య వచ్చిన.. ఏ ప్రైవేట్ హా స్పిటల్ కు ఎదురైన అందరం ఒకతాటిపై ఉండి అట్టి సమస్యను పరిష్కరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఐఎంఏ అ ధ్యక్షులు రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రెడ్ క్రాస్ భ వనం నందు ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులం తా మంగళవారం సమావేశమై ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డాక్టర్ల పై దాడులు చేస్తే ఎలా అని పలువురు డాక్టర్లు మీడియా ము ఖంగా ప్రత్యేకంగా ప్రశ్నించారు.

దాడులు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గతంలో పలు ఆసుపత్రిలో ఇలాంటి సమస్యలు ఎదురైన సమయంలో ప్రత్యేక చర్చలు జరిపి శాంతియుతంగా రామ్మోహన్ పరిష్కరించినట్లు ప లువురు పేర్కొంటున్నారు. చర్చలు సఫలం కాకపోవడంతో బాధితులు యునైటెడ్ హా స్పిటల్ డాక్టర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయగా, ఐఎంఏ అధ్యక్షులు రామ్మోహన్ పై దాడికి సంబంధించి ఇరువురు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.

మనిషి మరణించింది.. మనసుపెట్టి ఆలోచించండి..

ప్రతి వైద్యుడు రోగిని ఆరోగ్యంగా పంపెందుకు ప్రయత్నం చేస్తారన్న విషయం ప్రతి ఒక్కరికి విధితమే ఈ తరుణంలో అనుకోని కారణంగా వైద్య చికిత్సలు అందిస్తున్న సమయంలో మనిషి మరణిస్తే ఏ కుటుంబ స భ్యుడైన ఆగ్రహానికి లోనవుతారు. ఈ తరుణంలో డాక్టర్లు సైతం కొంత మానవత దృ ప్పదంతో ఆలోచించాలని పలువురు పే ర్కొంటున్నారు.

మృతి చెందిన సమయంలో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉండడంతో ఈ సంఘటన చోటు చేసుకుని ఉంటుందని మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో పూర్తిస్థాయిలో ప్రజల అనారోగ్యంతోనే నడుస్తాయని, ఈ తరుణంలో ఒక వ్యక్తి ప్రవేట్ ఆసుపత్రిలో మరణిస్తే ఆ విషయాన్ని పక్కన పెట్టి డాక్టర్లపై దాడులు చేశారని ఇందుకు తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పడం లో ప్రవేట్ హాస్పిటల్ వైద్యులు కూడా కొంత ఆలోచించాలని మరికొంతమంది చెబుతున్నారు.

కొందరు మాత్రం డాక్టర్లు సగం షెటర్లు ఓపెన్ చేసి తమ తమ ఓపి సేవలను యధావిధిగా కొనసాగించారు. మరణించిన మహి ళ కుటుంబ సభ్యులకు న్యాయం చేయడం తో పాటు రామ్మోహన్ పై దాడి చేయడం సరికాదని ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామ్మోహన్ పై దాడి చేయడంతో వివిధ ప్రవేట్ హాస్పిటల్ అందరూ ఏకమై రామ్మోహన్ కు మద్దతు తెలిపారు.