16-08-2024 12:22:00 AM
హైదరాబాద్, ఆగస్టు 15(విజయక్రాంతి): ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ట్వీట్ చేశారు. మహిళలపై అవమానకరంగా కేటీఆర్ మాట్లాడిన తీరు కమిషన్ దృష్టికి వచ్చిందని, ఆయన వ్యాఖ్యలు అనుచితంగా ఉండటమే కాకుం డా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు బాధను కలిగించాయని శారద పేర్కొన్నారు. కాగా, మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది.
రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మలను శుక్రవారం దగ్ధం చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డు డ్యాన్సులు చేయండి అంటూ అత్యంత హేళనగా మాట్లాడటం సరికాదని హితవు పలి కారు. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని కేటీఆర్ దెబ్బతీశారని, అందుకు నిరసగా జిల్లా, నియోజకవర్గం, మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చూడాలన్నారు.