16-08-2024 12:23:46 AM
ఏడాది పాటు పదవీ బాధ్యతలు
వైస్ చైర్మన్‌గా శ్రీనివాస సీ రాజు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): యంగ్ ఇండియా స్కిల్ యూని వర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ప్రభుత్వం నియమించింది. వైస్ చైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస సీ రాజును నియామకం చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ వంటి ప్రముఖ రంగాల్లో మహీంద్రా గ్రూపు సంస్థలకు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది.
దీని ఏర్పాటు కోసం ఆగస్టు 1న రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట బేగరికంచెలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ఆనంద్ మహీంద్రాతో సమావేశమై స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించి దానికి చైర్మన్‌గా వ్యవహరించాలని కోరారు. దీంతో స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించినట్టు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆయన పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరు ఏడాది పాటు ఆ పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.