15-08-2024 09:06:51 PM
కరీంనగర్: కరీంనగర్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాలు, ఇండస్ట్రీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జాతీయజెండాను ఎగురవేశారు. టిఎన్జీవోల సంఘం నేతలు మంత్రి శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్, అర్బన్ అధ్యక్షులు హరిణిందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, జిల్లా నాయకులు రమేష్ గౌడ్, ఉపాధ్యాయుల చంద్రశేఖర్, రాజేశ్వరరావు, జల్లాలుద్దిన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.