calender_icon.png 10 September, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

10-09-2025 05:48:52 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ బొక్కలగడ్డ ఐడియల్ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడాది కాలంగా వృత్తి నైపుణ్యత కోసం శిక్షణ పొందిన మహిళలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) సర్టిఫికెట్ లను అందించారు. మొదటగా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. శిక్షణ తరగతుల నిర్వహణ, కుట్టు మిషన్ ల పనితీరు గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళ సాధికారత లక్ష్యంగా చాలా పథకాలను ప్రవేశపెట్టిందని, ఎన్నో నూతన కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పట్టణ గృహిణులకు ఇటువంటి కార్యక్రమాల ద్వారా మంచి ఉపాధి అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు.

మహిళలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలని సూచించారు. శిక్షణ తీసుకుంటున్న ప్రతి మహిళా ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభలను నిరూపించుకోవడం చాలా అవసరమని తెలిపారు. మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిన క్రమంలో తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే గా పనులను చేపట్టి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, జిల్లా మైనారిటీ చైర్మన్ అజీజ్ ఉల్లా బేగ్, మాజీ కార్పొరేటర్ అబూబకర్, డివిజన్ అధ్యక్షులు శివాజీ, మైనారిటీ సంఘం కమిటీ సభ్యులు అధ్యక్షులు ఎండి. సిరాజ్ అహ్మద్, ఎండి. అబ్దుల్ కలీం, ఎండి. ఖైరున్ నస్రిన్, ఎండి. సఫ్దర్ బాబా, మీర్జా చిష్టీ, అబ్దుల్ జలీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.