10-09-2025 05:46:09 PM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దసరా నవరాత్రి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Laxmi) అన్నారు. రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభు మహంకాళి దేవస్థానంలో ఈనెల 22 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించే శరన్నవరాత్రుల ఉత్సవాల వాల్ పోస్టర్లను నిర్వాహకులతో కలిసి తన నివాసంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వయంభూ వెలసిన అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించే ఉత్సవాలలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్, అధ్యక్షుడు తిరుపతి గౌడ్, కమిటీ సభ్యులు శ్రీకర్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.