calender_icon.png 30 September, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చురుకుగా పని చేయండి

30-09-2025 12:20:19 AM

జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 29(విజయక్రాంతి): జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా చురుకుగా పనిచేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

బాధ్యతలు ఎవరికి అప్పజెప్పిన అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని సూచించారు. నిర్లక్ష్యం అనే మాట కు తవులేకుండా పకడ్బందీగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల నాయకులు గూడెం రాంచంద్రయ్య, గోవింద్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మాధవరెడ్డి ఖాజా అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.