30-09-2025 01:38:42 AM
భద్రాచలం, సెప్టెంబర్ 29, (విజయక్రాంతి):భద్రాచలం ఐ టి డి ఏ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగములో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ గా మధుకర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ గా పనిచేసిన సత్యానందం బదిలీపై హైదరాబాద్ వెళ్ళినందున ఆయన స్థానంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాల్వంచ డివిజన్ డీఈ గా పనిచేస్తున్న.
ఆయనను పదోన్నతిపై భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంనకు బదిలీ చేసినందున సోమవారం నాడు ఆయన ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ గా బాధ్యతలు స్వీకరించారు.ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ గా బాధ్యతలు తీసుకున్న మధుకర్ ను కార్యాలయంలోని సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.