calender_icon.png 30 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధపూజ

30-09-2025 01:35:36 AM

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 29,(విజయక్రాంతి)ఈ రోజు హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు దసరా నవరాత్రుల సందర్భంగా ఆయుధ పూజను సోమవారం ఘనంగా నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ అశోక్ మరియు సీఐలు,ఆర్‌ఐలు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

ఆయుధ పూజ అనంతరం వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడంలో భాగంగా ఈరోజు ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు, సిబ్బందికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.