calender_icon.png 30 September, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందాల విందు పంచేందుకు ప్యారడైజ్‌లోకి..

30-09-2025 01:32:31 AM

నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకొంటోంది. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసిన టీమ్.. హీరోయిన్ విషయమై ఇప్పటివరకూ తుది నిర్ణయానికి రాలేదు. అందుకే హీరోయిన్ లేకుండా ఉండే సన్నివేశాల్ని ఇప్పటివరకూ చిత్రీకరించినట్టు సమాచారం.

అయితే, నాని ఈ సినిమా హిట్‌తో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలన్న సంకల్పంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న ప్రాజెక్ట్ ఇది. అందుకే ఇందు లో కథానాయిక పాత్రకు తీసుకునే హీరోయిన్ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తారని, బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటారని ఇప్పటివరకు అందరూ భావించారు. కానీ, ఈ ప్రాజెక్టులో భాగమయ్యే హీరోయిన్ గురించిన సమాచారం తెలిసి అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఎవరూ ఊహించని యంగ్ బ్యూటీని మేకర్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో నాని సరనన నటించే అవకాశాన్ని యువ నాయిక కయాదు లోహార్‌కు కల్పించినట్టు సమాచారం. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో టాలీవుడ్‌కు పరిచయమైన కయాదు లోహర్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. గ్లామర్‌తో ఆకర్షించి, యువత గుండెల్లో డ్రీమ్‌గాళ్‌గా చోటు దక్కించుకుంది.

అలా ఒక్క సినిమాతోనే అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న కారణంగానే ఈ అమ్మడినే నానికి జోడీగా ఎంపిక చేసే ఆలోచనలో ఉందట ‘ప్యారడైజ్’ టీమ్. ప్రస్తుతం ఈ కయాదు తమిళంలో నాలుగైదు సినిమాలు చేస్తోంది.