calender_icon.png 20 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

20-11-2025 12:36:43 AM

కలెక్ట కలిసి వివరించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి, నవంబర్ 19(విజయక్రాంతి): సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బుధవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్,మాధు రిలను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు ప్రధాన అంశాలను తీసుకొచ్చారు.

తాగునీటి సమస్య, రహదారుల మరమ్మతులు, పెండింగ్ పనులు, రైతులకు సమస్య ల పరిష్కారం వంటి విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఫసల్వాది, కంది, ఇంద్రకరణ్, ఆరుట్ల గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ లో భూములు కోల్పోయిన రైతులకు రైతు బీమా, రైతు భరోసా రావడం లేదని వారికి సంబంధించి తగు చర్యలు తీసుకొని వారికి లబ్ధి చెందాల్సిన అంశాలను విపులంగా చర్చించారు.

మునిదేవునిపల్లి 92 సర్వేలో టీజీఐఐసీ ద్వారా భూములు కోల్పోతున్న భూములు పూర్తిగా సాగు చేస్తున్నటువంటి భూములు, మినహాయించకపోతే సాగు చేసే వారందరూ వారి కుటుంబాలు రోడ్డున పడతాయని కలెక్టర్కు వివరించారు. కచ్చితంగా భూములు తీసుకుంటే మాత్రం రైతులు సం తోషపడే విధంగా పరిహారం చెల్లించాలని కోరారు. అదే విధంగా భూమి నష్టపోతున్న వారికి ఇండ్ల ప్లాట్లు కేటాయించాలని కోరారు.

గ్రీన్, ఆరెంజ్ లో ఉన్నందున కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే కు కలెక్టర్ వివరించారు. స్థానికులు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చూడాలని కలెక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు. ఆలియాబాద్ గ్రామంలో 24 ఎకరాలు రైతుల భూమి పొరపాటున వక్ఫ్ బోర్డ్ లో పడిందని, అందులో నుంచి తీసివేయాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు.

వెంటనే స్పందించిన కలెక్టర్ వక్ఫ్ బోర్డ నుంచి తీసివేస్తామని హామీ ఇచ్చారు. సింగూర్ ప్రాజెక్టు మరమ్మతుల దృష్ట్యా ప్రజలకు తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సంగారెడ్డి బైపాస్ రోడ్డు మరమ్మతులు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయని, పనులు మధ్యలోనే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ఇవేగాకుండా అనేక సమస్యలపై కలెక్టర్కు వివరించారు. స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఆర్.వెంకటేశ్వర్లు, రైతులు ఉన్నారు.