calender_icon.png 6 May, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ దెబ్బతో కార్మికుడు మృతి

06-05-2025 12:44:10 AM

కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి : సీపీఎం జిల్లా నాయకులు దొంగల తిరుపతిరావు

భద్రాద్రి కొత్తగూడెం మే 5 (విజయక్రాంతి) ఖమ్మం నగర పరిధిలోని కైకొడాయి గూడెం ప్రాంతానికి చెందిన బోల్లపు శ్రీనివాస్ రెడ్డి (47) వడదెబ్బతో సోమవారం మృతి చెందారు. గత 3 రోజులుగా వాంతు లు ,విరేచనాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ రెడ్డి తెల్లవారుజామున ఐదున్నర గంటలకు చికిత్సా పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

బల్లెపల్లి ప్రాంతంలో ఉన్న ప్రైవేటు యు పి వి సి లో ఇండస్ట్రీలో పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి రోజువారి కూలి నిమిత్తం విధులకు హా జరుకాగా ఆ పని ప్రదేశం లో తీవ్ర ఎండతో సోమసిల్లీ పడిపోవడంతో స్థానికులు ఖ మ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మూడు రోజులు పాటు చికిత్స పొందిన శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడ్డారు.

కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న వ్యక్తి మృత్యు వాత పడడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని సిపిఎం జిల్లా నాయకులు దొంగల తిరుపతిరావు పరామర్శించి కుటుంబానికి సానుభూ తి వ్యక్తం చేశారు. శ్రీనివాసరెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.