28-08-2025 05:55:15 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) అన్నారు. గురువారం నకిరేకల్, కేతేపల్లి మండలంలోని గుడివాడ, కాసనగోడు గ్రామాల్లో రూ. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కాసనగోడు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 14.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కంప్యూటర్ గది నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల-మాధవ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కంపాసటి శ్రీనివాస్, కోట మల్లికార్జున్ పసునూరి ఇందిరా ,బొజ్జ సుందర్, లతీఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.