calender_icon.png 28 August, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు

28-08-2025 05:52:43 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు(District Library Chairman Kota Rajababu) గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రంథాలయ భవనం కూడా మంజూరు చేయించడం కొరకు తన సహాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శైలజ, బ్లాక్ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు అస్రార్ ఖురేషి, గ్రంథాలయ నిర్వాహకురాలు తదితరులు పాల్గొన్నారు.