calender_icon.png 20 October, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ, వ్యవసాయ వాస్తవాలపై కార్యశాల

18-10-2025 01:40:17 AM

పాల్గొన్న ప్రముఖ ప్రొఫెసర్‌లు

పటాన్ చెరు, అక్టోబర్ 17 : భారతీయ సామాజిక శాస్త్ర సంఘం (ఐఎస్‌ఎస్) సహకారంతో హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్‌ఎస్) సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో ’గ్రామీణ, వ్యవసాయ వాస్తవాలు, విమర్శనాత్మక దృక్పథాలు, ఉద్భవిస్తున్న ధోరణులు’ అనే అంశంపై రెండు రోజుల యువ స్కాలర్ల కార్యశాలను ఈనెల 16, 17 తేదీలలో నిర్వహించారు.

ఐఎస్‌ఎస్ అధ్యక్షురాలు, జేఎన్ యూలోని మాజీ సోషియాలజీ ప్రొఫెసర్ మైత్రేయీ చౌదరి ఆన్ లైన్ లో స్వాగత ప్రసంగంతో శ్రీకారం చుట్టుకున్న ఈ కార్యశాలలో సోషియాలజీ విభాగ అభివృద్ధి, దాని ఔచిత్యాన్ని యువ స్కాలర్లను పెంపొందించడంలో ఐఎస్‌ఎస్ పాత్రను ప్రతిబింబించారు. గ్రామీణ, వ్యవసాయ మార్పును అర్ధం చేసుకోవడం, గ్రామీణ, వ్యవసాయ సంక్షోభం, ప్రతిఘటనను అర్ధం చేసుకోవడం అనే రెండు ఆలోచింపజేసే ప్యానెల్ చర్చలలో ప్రొఫెసర్ సురీందర్ జోధా, (జేఎన్ యూ), ప్రొఫెసర్ మనీష్ ఠాకూర్ (ఐఐఎం కోల్ కతా), ప్రొఫెసర్ బి.బి. మొహంతి (పాండిచ్చేరి విశ్వవిద్యాలయం), ప్రొఫెసర్ ఆర్.రామకుమార్ (టీఐఎస్‌ఎస్, ముంబై), ప్రొఫెసర్ పురేంద్ర ప్రసాద్ (హైదరాబాదు విశ్వవిద్యాలయం), డాక్టర్ ఎస్. సీతాలక్ష్మి (స్వతంత్ర పరిశోధకురాలు, మహిళా కిసాన్ అధికార్ మంచ్ సభ్యురాలు) వంటి ప్రముఖులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందుతున్న గ్రామీణ, వ్యవసాయ వాస్తవాలతో విమర్శనాత్మకంగా పాల్గొనడానికి ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగపడింది.