15-01-2026 01:35:32 AM
నేటి నుంచే అండర్ 19 వరల్డ్‌కప్
టైటిల్ ఫేవరేట్‌గా భారత్
వైభవ్ సూర్యవంశీపైనే అందరి చూపు
బులవాయో, జనవరి 14: అండర్ 19 వరల్డ్‌కప్‌కు 2026 కు రంగం సిద్దమైంది. సౌతాఫ్రికా వేదికగా గురువారం నుంచే ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత కుర్రాళ్ల జట్టు అమెరికా అండర్ 19 టీంతో తలపడనుంది. అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో గ్రూప్-బీ లో భారత్ ఉంది. సౌతాఫ్రికాతో యూ త్ వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత కుర్రాళ్ల జట్టు సూపర్ ఫాంలో ఉంది. అండర్ 19 ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడినా.. భారత్‌కు వచ్చే సమస్య లేదు. విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ భారత జట్టుకు కీలకం కానున్నాడు. అతనితో పాటు విహాన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ కుందు, ఆయుష్ మాత్రేలతో భారత బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. ఆయుష్ మాత్రే ఫాంలో లేకపోవడం టీమిండియాను కలవరపెడుతుంది. కానీ, మెగా టోర్నీలో అతను టచ్‌లోకి వస్తాడని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. దీంతో గ్రూప్ లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం లేదు. మొత్తం 16 జట్లు 2026 మెగా ఈవెంట్లో పాల్గొననుండగా వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. 23 రోజుల్లో 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి. భారత్ ఆడే మ్యాచులన్నీ బులవాయోలో జరుగనున్నాయి. భారత్.. జనవరి 15 యూ ఎస్ టఏతో, జనవరి 17న బం గ్లాదేశ్, జనవరి 24న న్యూజిలాండ్ తో తలపడనుంది. కాగా, రౌండ్ రాబిన్ సిస్టమ్‌లో గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ జట్లు సూపర్-6 దశకు అర్హత సాధిస్తాయి. రెండు సూపర్-6 గ్రూప్లలో టాప్-2గా నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అనంతరం గెలిచిన దేశాలు ఫైనల్లో పోటీపడతాయి. భారత్ ఇప్పటివరకు అత్యధికంగా ఐదు టైటిళ్లు కైవసం చేసుకున్నది. 2024 ఫైనల్ లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.