calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్‌లో బతుకమ్మలకు పూజలు

22-09-2025 12:00:00 AM

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

సుల్తానాబాద్, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి) పూలను పూజించి... ప్రకృతిని ఆరాధించే ఆడబిడ్డల పూల పండుగ ... ఎంగి లిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం సు ల్తానాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి... పట్టణంలోని శివాలయంలో ఉదయమే మహిళలందరూ కలిసి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు... మొదట శివునికి పూజలు నిర్వహించిన అ నంతరం...

బతుకమ్మలను ఒక చోట పెట్టి .... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు.... ఈ కార్యక్రమం శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించగా పూజారి వల్ల కొండ మహేష్ , రమేష్ లు ప్రత్యేక పూజలు చేశారు.... అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ తో పాటు దేవాల యాల్లో...వాడ వాడలా ఎంగిలిపూల బతుక మ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.