calender_icon.png 17 May, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిన్న బీఆర్‌ఎస్...నేడు కాంగ్రెస్

23-04-2025 01:36:27 AM

* ఒక్క రోజులో రెండు పార్టీలు మారిన నాయకులు 

నార్సింగి(చేగుంట), ఏప్రిల్ 22 :నార్సింగి మండల కేంద్రంలో నాయకుల తీరు విచిత్రంగా ఉంది. ఒక్క రోజు తేడాతోనే రెండు పార్టీలు మారారు. నార్సింగి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కండకొయ్య శ్రీకాంత్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు.

మరుసటిరోజు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి నార్సింగి కోఆర్డినేటర్ జుకంటి రాజాగౌడ్ ఆధ్వర్యంలో సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజగౌడ్ మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  కార్యకర్తకు ఇష్టం లేకుండా పార్టీ కండువా కప్పి బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపించారు.

ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నాకు ఇష్టం లేకుండా బలవంతంగా బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పారని అందుకే నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని తెలిపారు. నియోజకవర్గంలో చెరుకు శ్రీనివాస్రెడ్డి చేసే అభివృద్ధి, మంచి పనులకు ఆకర్షితులై తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగిందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గోవర్ధన్, నార్సింగి పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాచి, ఫిషర్ మాన్ మండలాధ్యక్షుడు సుధాకర్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ టెలికాం మెంబెర్ రాజేష్, జహీర్, మాజీ ఎంపిటిసి సత్యనారాయణ పాల్గొన్నారు.