22-05-2025 01:04:12 AM
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి(మహబూబాబాద్) మే 21 (విజయ క్రాంతి): స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషితో నే భారతదేశం శాస్త్ర సాంకేతిక రం గంలో ముందడుగు వేసిందని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లిలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన గొప్ప మార్గదర్శి, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువత దేశ సమైక్యత సమగ్రత కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.