20-10-2025 12:40:53 AM
ముషీరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగిన 50వ జాతీయ స్థాయి సీనియర్ యోగాసన పోటీల్లో కాంస్య పతకం సాధించిన రంగారెడ్డి జిల్లా క్రీడాకారిణి పి. అరు ణ కుమారిని తెలంగాణ యోగ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నర్సింహ గౌడ్, అక్కినే పల్లి మంజుల, కోశాధికారి జడి రాజు, దుర్గం వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.