calender_icon.png 13 September, 2024 | 12:13 AM

మీరు చేసిందీ అదేగా!

31-07-2024 01:15:34 AM

యూపీఏ హయాంలో బడ్జెట్‌లో రాష్ట్రాలపై వివక్ష

2009 బడ్జెట్‌లో 26 రాష్ట్రాల పేర్ల ప్రస్తావన లేదు

విపక్షాల విమర్శలపై ఆర్థికమంత్రి నిర్మల కౌంటర్

న్యూఢిల్లీ, జూలై 30: కేంద్ర బడ్జెట్‌లో కొన్ని రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందన్న విపక్షాల విమర్శలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. 2009-10 ఏడాది వార్షిక బడ్జెట్‌లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 26 రాష్ట్రాల గురించి కనీసం ప్రస్తావించలేదని ఎదురు దాడికి దిగారు. లోక్‌సభలో బడ్జెట్ చర్చలో ఆమె మంగళవారం మాట్లాడారు. విపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.

వామపక్ష ప్రభుత్వం ఉన్న కేరళకు వయబుల్ గ్యాప్ ఫండ్ కింద రూ.818 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ‘2004-05 బడ్జెట్‌లో 17 రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదు. అంతమాత్రాన ఆ రాష్ట్రాలకు నిధులు వెళ్లలేదా? ఒకవేళ నిధులు ఆపేస్తే వాళ్లు దాన్ని ప్రశ్నిస్తారు కదా? 2005-06 బడ్జెట్‌లో 18 రాష్ట్రాల పేర్లు కనిపించలేదు’ అని తెలిపారు.