calender_icon.png 15 July, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకు మురిపెం..మాకు మోసం

13-07-2025 12:13:44 AM

నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం జేబీఎం కంపెనీకి చెందిన 40 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ ఎలక్ట్రిక్ బస్సును మంత్రి కోమటిరెడ్డి నడుపుతూ మురిసిపోయారు. అయితే ఈ బస్సులేవీ ప్రభుత్వానికి చెందినవి కాదు. నేరుగా ప్రైవేటు కంపెనీ తన బస్సులను ప్రవేశపెట్టి నిర్వహిస్తుంది. ప్రస్తుతం 40 బస్సులను ప్రారంభించగా..త్వరలో 37 బస్సులను తీసుకువస్తారట.

అయితే ఈ బస్సులకు కండక్టర్ తప్పించి అంతా ప్రైవేటు సంస్థే నిర్వహిస్తుంది. ఓవైపు కార్మికులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆర్టీసీ సొంత బస్సులను పూర్తిగా తగ్గించేస్తూ..కార్మికుల ఉద్యోగాలకు ఎసరుపెడుతూ.. ప్రైవేటు బస్సులను ప్రభుత్వ బస్సులన్నంత మురిపెంగా ప్రారంభిస్తూ తమ జీవితాలను ఆగం చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. తాము ఆవేదన చెందుతుంటే ప్రజాప్రతినిధులు మురిసిపోతున్నారంటూ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

 విజయభాస్కర్