19-11-2025 12:00:00 AM
- అప్పు తీర్చలేక ఆత్మహత్య
-హనుమకొండ జిల్లాలో ఘటన
హనుమకొండ, నవంబర్ 18 (విజయక్రాంతి): లోన్ యాప్‌లో తీసుకున్న అప్పు తీర్చలేక, లోన్ యాప్ వారి వేధింపులు భరించలేక హనుమకొండ అమరావతి నగర్ టీవీ టవర్ కాలనీకి చెందిన గోలి నవీన్‌రెడ్డి అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైనాకు చెందిన యాప్‌లో లోన్ తీసుకొని చెల్లించకపోవడంతో అతడి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్‌లో పోస్ట్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్.. తన గ్రామ సమీపంలో ఉన్న వడ్డేపల్లి-దేవన్నపేట మధ్యలోని బావిలో దూకి బలవన్మరణం చెందాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాకతీయ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.